‘సుల్తాన్’ టీజర్ రిలీజ్

Sulthan Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sulthan Official Teaser Telugu,Karthi,Vivek Mervin,Bakkiyaraj Kannan,Hero Karthi,Actor Karthi,Rashmika Mandanna,Sulthan,Sulthan Movie,Sulthan Film,Sulthan Telugu Movie,Sulthan Movie Telugu,Karthi Sulthan,Karthi Sulthan Movie,Karthi Sulthan Teaser,Karthi Sulthan Movie Teaser,Karthi Sulthan Movie Teaser Out,Karthi Sulthan Movie Teaser Unveiled,Sulthan Teaser Out Now,Sulthan Movie Teaser Released,Sulthan From April 2,Sulthan Teaser,Sulthan Teaser Telugu

‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా ‘సుల్తాన్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. “భార‌తం చ‌దివావా.. కృష్ణుడు వంద అవ‌కాశాలు ఇచ్చినా… కౌర‌వులు మార‌లేదు. నువ్వ‌డిగింది ఒక్క అవ‌కాశ‌మే క‌దా. ఇస్తా” అని విల‌న్ అన్న డైలాగ్ కు మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడని, అదే కృష్ణుడు పాండవుల వైపు ఉంటే ఎలా ఉంటుంది? మహాభారతం యుద్ధం లేకుండా ఊహించుకుంటే ఎలా ఉంటుందో చూడాలంటూ కార్తీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం వివేక్ మెర్విన్ అందిస్తుండగా.. ఎడిటింగ్: అంతొనీ, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − five =