‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, ‘రాక్షసుడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఖిలాడి. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి తోడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న విడుదల చేసిన వీడియో గ్లిమ్స్‌కు సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మే 28న చిత్రం విడుదలవుతోందని వెల్లడిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రస్‌లో, బ్లాక్ గాగుల్స్, బ్లాక్ షూస్‌తో, చేతిలో రివాల్వర్‌తో రోడ్డు మీద నడచుకుంటూ వస్తున్న రవితేజ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ ఉన్నాయి.
Let’s play from 28th May in cinemas.#Khiladi pic.twitter.com/om7LuTmsRj
— Ravi Teja (@RaviTeja_offl) January 30, 2021
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: