‘పాగల్’ ఫస్ట్ లుక్ రిలీజ్ – రిలీజ్ డేట్ ఫిక్స్ 

Vishwak Sen Paagal Movie Team Unveils First Look and Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen,Hero Vishwak Sen,Actor Vishwak Sen,Paagal,Paagal Movie,Paagal Film,Paagal Movie telugu,Paagal Movie Release Date,Paagal Release Date,Vishwak Sen Starrer Paagal,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Release Date,Paagal Release Date Out,Paagal Release Date Confirmed,Paagal Release Date Announced,Paagal Release Date Fix,Paagal First Look,Paagal On April 30th,Paagal Movie First Look,#Paagal

మలయాళ సినిమా అంగమలై డైరీస్‌ను తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్‌’గా తెరకెక్కించిన విశ్వక్‌ సేన్‌.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంతేకాదు ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 30న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఇక విశ్వక్ సేన్ తమిళ్ హిట్ మూవీ ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. త‌రుణ్ భాస్క‌ర్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండ‌గా, అశ్వ‌థ్‌ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 2 =