ఆది ‘శశి’ – మారిన రిలీజ్ డేట్

Sashi Movie Team Comes Up With A New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sashi On March 19th,Aadi Saikumar,Sashi,Sashi Movie,Sashi Film,Sashi Telugu Movie,Sashi Movie Telugu,Sashi Movie Release Date,Sashi Release Date,Aadi Sashi,Hero Aadi,Actor Aadi Saikumar,Aadi Sashi Movie Release Date,Aadi Sashi Release Date Fix,Aadi New Movie,Aadi Sashi Release Date Announced,Aadi Sashi Release Date Confirmed,Aadi Sashi Release Date Out,Sashi Movie Gets A Release Date,Sashi Release On March 19th,#Sashi

శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా ‘శశి’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నట్లు సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. తాజాగా రిలీజ్ డేట్ ను మారుస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 12న కాకుండా మార్చి 19న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

 

కాగా ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్‌ హీరోయిన్లు గా నటిస్తుండగా రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్‌ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. మరి జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు ఆది. హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘జంగిల్’ సినిమాలో చేస్తున్నారు… ఈ ద్విభాషా చిత్రాలతో తొలిసారి ఆది తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అలానే ‘బ్లాక్’ అనే సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డ్ గా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here