ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 89
'వాలెంటైన్స్ డే' కి రాధే శ్యామ్ టీజర్..?
కీర్తి సురేష్ కు మరో అరుదైన ఘనత
'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్
'డియర్ మేఘ' ఫస్ట్ లుక్ రిలీజ్
గోపీచంద్-మారుతి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

శివ కార్తికేయన్ 'డాక్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్ 'చెక్' మూవీ ట్రైలర్ పబ్లిక్ రెస్పాన్స్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ డేట్ ఫిక్స్
నితిన్ 'చెక్' ట్రైలర్ రిలీజ్
శింబు 'మానాడు' టీజర్ రిలీజ్
వర్క్ మోడ్ లో వరుణ్
పెళ్లి పీటలెక్కుతున్న సుమంత్ అశ్విన్
'ఖిలాడి' లో రంగమ్మత్త
'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
'ఆదిపురుష్' సెట్ లో అగ్నిప్రమాదం
మెగా '13' సెంటిమెంట్
నితిన్ చెక్ పై 'చెస్ కామ్ ఇండియా' రియాక్షన్
రొటీన్ సినిమా ఫార్ములాకు చెక్ పెట్టి మొదటిసారి కాస్త విభిన్నమైన కథతో వస్తున్నాడు నితిన్. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా చెక్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తూనే ఉన్నాం. చాలా డిఫరెంట్ థీమ్ తో వస్తుంది. చదరంగాన్ని, జీవితాన్ని ముడిపెడుతూ తీసిన సినిమా.. మరణ శిక్ష పడిన ఖైదీ తన చదరంగం నైపుణ్యంతో బయటకు రావడానికి ఎలా ప్రయత్నిస్తాడు అన్నది కథ. ట్రైలర్ లో అయితే కొంతే చూశాం.. మరి నితిన్ ఎత్తులు పైఎత్తులు చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆకట్టుకుంటున్న ఉప్పెన ట్రైలర్ - ప్రేమ చరిత్రలోనే ఉంటుంది
మొత్తానికి అందరూ ఆసక్తిగాఎదురుచూస్తున్న ఉప్పెన ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాపై మొదటినుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఒకరకంగా ఈ సినిమాకు అంత హైప్ రావడానికి కారణం ఈ సినిమా నుండి విడుదలైన నీ కళ్లు నీలి సముద్రం పాట అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. ఆ పాట మొదలైన హైప్ పోస్టర్స్, టీజర్ తో మరింత పెరిగింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు.
'వాలెంటైన్స్ డే' కి రాధే శ్యామ్ టీజర్..?
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పూజా హెగ్డే తన షూట్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రతో నటించనున్నారు. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కీర్తి సురేష్ కు మరో అరుదైన ఘనత
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా మహానటి సినిమా మాత్రం కీర్తి సురేష్ కు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. 'మహానటి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో జాతీయ అవార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్. ఇక మహానటి తర్వాత వరుస ఆఫర్స్ ను అందిపుచ్చుకుంటున్న కీర్తి అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క కమెర్షియల్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. గత ఏడాది లాక్ డౌన్ వల్ల థియేటర్స్ లేకపోయినా.. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్…
'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది నుండి ఎదురుచూస్తున్నాడు వైష్ణవ్ కూడా. ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, పోస్టర్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టు వైష్ణవ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మరింత ఆకట్టుకొని ఆ అంచనాలను రెట్టింపు చేసింది. హీరో, హీరోయిన్ నటన బావుందని.. సినిమాలో కొత్తదనం కనిపిస్తోందన్న…
'డియర్ మేఘ' ఫస్ట్ లుక్ రిలీజ్
‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేకపోయింది నటి మేఘ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్స్ లు కూడా రాలేదు. అయితే ఈ గ్యాప్ లో తమిళ్ లో సినిమాలు చేసింది. వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఇప్పటివరకూ సక్సెస్ టేస్ట్ మాత్రం చూడలేకపోతుంది.
గోపీచంద్-మారుతి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సాయి ధరమ్ తేజ్‌కు `ప్రతీరోజు పండగే` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి మరో కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. ఇటీవలే గోపీచంద్ తో తన తర్వాత సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఇక ఇంకా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.. షూట్ మొదలుపెట్టలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించారు. గత రెండు వారాలుగా అందరూ సినిమా రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది.
రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ఈ గ్యాప్ లో పలువురి డైరెక్టర్స్ తో సినిమా ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అసలే లాక్ డౌన్ వల్ల లేట్ అయింది అనుకుంటే రాజశేఖర్ కు కూడా కరోనా రావడంతో ఇంకా లేట్ అయింది. ఇప్పుడు పూర్తి గా కోలుకున్నారు. షూటింగ్ కు రెడీ అవుతున్నారు.

శివ కార్తికేయన్ 'డాక్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్
‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. దానితో తన సినిమాలు కూడా తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం కార్తికేయ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'డాక్టర్' అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

నితిన్ 'చెక్' మూవీ ట్రైలర్ పబ్లిక్ రెస్పాన్స్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో నితిన్ కూడా ఒకడని అతను చేసిన సినిమాలను చూస్తే చెప్పొచ్చు. ఇక గత ఏడాది భీష్మ తో హిట్ కొట్టిన నితిన్ చెక్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేటట్లే కనిపిస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో చెక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ ను చూస్తే నితిన్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టడం పక్కా అన్న టాక్స్ అప్పుడే వినిపిస్తున్నాయి.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ డేట్ ఫిక్స్
అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్, ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక గత కొద్దికాలంగా ఈ సినిమానుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అందరూ రిలీజ్ డేట్ లు ఫిక్స్ చేస్తున్నా అఖిల్ ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
నితిన్ 'చెక్' ట్రైలర్ రిలీజ్
భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ సినిమా ఒకటి. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. విభిన్నమైన కథతో వస్తుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.. దానికి తోడు ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.
శింబు 'మానాడు' టీజర్ రిలీజ్
ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'రీవైన్డ్' అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించినా కరోనా వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.
వర్క్ మోడ్ లో వరుణ్
'ముకుంద'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే మొదటి సినిమా అంత విజయం అందించలేకపోయినా రెండో సినిమా 'కంచె'తోనే జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
పెళ్లి పీటలెక్కుతున్న సుమంత్ అశ్విన్
గత ఏడాది కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.. థియేటర్స్ మూత పడ్డాయి కానీ టాలీవుడ్ లో ఎప్పుడూ జరగనన్ని పెళ్లిళ్లు మాత్రం జరిగాయి. నితిన్, అఖిల్, రానా, మెగా డాటర్ నిహారిక, దిల్ రాజు, సాహో డైరెక్టర్ సుజీత్ ఇలా చాలా మంది పెళ్లి పీటలెక్కారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ ఏం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్.
'ఖిలాడి' లో రంగమ్మత్త
'రంగస్థలం'లో రంగమ్మత్త క్షణం'లో ఏసీపీ జయ భరద్వాజ్ గా సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది అనసూయ. ఒకవైపు బుల్లితెరపై టాప్ యాంకర్ గా యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం తను ప్రధాన పాత్రలో ' థ్యాంక్ యూ బ్రదర్' అనే సినిమాలో వస్తుంది. ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా మరో మంచి పాత్రలో నటిస్తుంది.
'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వస్తున్న డెబ్యూ హీరో వైష్ణవ తేజ్. సాయి తేజ్ తమ్ముడిగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఈ హీరో ఎంట్రీ ఎప్పుడో అవ్వాలి కానీ లాక్ డౌన్ వల్ల లేట్ అయిపోయింది. ఏడాది తర్వాత ఇప్పుడు ఫైనల్లీ థియేటర్స్ లోకి వస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఇక ఇప్పటికే ఈ సినిమా పాటలతో సినిమాపై అంచనాలు పెంచగా.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.
'ఆదిపురుష్' సెట్ లో అగ్నిప్రమాదం
ఆదిలోనే ఆటకం కలిగింది ఆదిపురుష్ టీంకి. ఈ రోజే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. అలా ప్రారంభించారో లేదో సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఎంత తీవ్రత ఉందో. ఈ ప్రమాదంలో సెట్ చాలా వరకూ కాలిపోయినట్టు తెలుస్తుంది. అయితే అదృష్టం ఏంటంటేప్రమాదం జరిగినప్పుడు అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. దాంతో యూనిట్ అంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని సమాచారం. ఇక షూటింగ్ మొదలైన…

'మాయదారి మోసగాడు' - బ్రహ్మీ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. అందుకే దాదాపు తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇక ఇప్పుడు 'మాయదారి మోసగాడు' సినిమాలో బ్రహ్మీ కామెడీ సీన్స్ మీకోసం.. కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.
మెగా '13' సెంటిమెంట్
నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు.