విశాల్ ‘చక్ర’ రిలీజ్ డేట్ ఫిక్స్

Vishal Chakra Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chakra,Chakra Movie,Chakra Film,Chakra Movie Release Date,Chakra Release Date,Vishal Chakra,Chakra Vishal,Vishal Chakra Movie,Vishal Chakra Movie Release Date,Chakra Movie Release Date Announced,Chakra Movie Release Date Confirmed,Chakra Movie Release Date Out,Chakra Movie Release Date Fix,Vishal Chakra Movie Update,Vishal,Actor Vishal,Hero Vishal,Chakra From Feb 19,Vishal Chakra Release On Feb 19th,Chakra on Feb 19th

విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘చక్ర’. బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో ఫుల్ టెక్నికల్ విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు,త‌మిళ‌,మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాషల్లో విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.