‘ఆచార్య’ లా మారిన వార్నర్

Australian Cricketer David Warner Turns Acharya To Entertain Social Media Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,David Warner,Cricketer David Warner,Acharya,Acharya Movie,David Warner Turns Acharya,Cricketer David Warner Turns Acharya,David Warner Become Acharya,Australia Cricketer David Warner As Acharya,David Warner Turns As Acharya,David Warner Acharya,David Warner Viral Video,Australian Cricketer David Warner,Acharya David Warner,David Warner Reface Videos,Instagram,David Warner New Video

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. మహర్షి లా మారాడు, బంటు పాత్రలో దూరాడు, ప్రభాస్ బాహుబలి అయ్యాడు.. ఎన్టీఆర్ లా మారాడు.. ఇక ఇప్పుడు ఏకంగా ఆచార్య లా మారాడు. ఇటీవలే చిరు నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఫేస్ యాప్ ద్వారా టీజర్ లోని చిరు ప్లేస్ లో తన పేస్ పెట్టి వీడియో చేసి పోస్ట్ చేశాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

కాగా కొరటాల శివ దర్శకాత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇందులో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ‘సిద్ధ’ అనే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =