శృతి హాసన్ బెస్ట్ జోడి..?

Who Among These Heroes Make The Perfect Pair With Shruti Haasan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan Perfect Pair,Shruti Haasan Best Pair,Shruti Haasan Best Couple,Shruti Haasan Movies,Shruti Haasan Movie Heroes,Shruti Haasan Movie Actors,Shruti Haasan Best Pair Actors,Shruti Haasan POLL,POLL,TFN POLL,Perfect Pair With Shruti Haasan,Perfect Pair For Shruti Haasan,Shruti Haasan Latest Movie Update,Shruti Haasan New Movie News

క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన‌ శృతి హాస‌న్ తండ్రికి ‌తగ్గ త‌న‌య‌గా పేరును సంపాదించుకుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట వరుస ప్లాప్స్ తో కాస్త ఇబ్బంది పడ్డ శృతి ఆ తర్వాత చాలా మంది హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న గ‌బ్బ‌ర్ సింగ్‌ లో నటించి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఆ త‌రువాత వీరిద్ద‌రి కాంబోలో కాట‌మ‌రాయుడు రాగా.. ఇప్పుడు వ‌కీల్ సాబ్‌లోనూ ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతీ న‌టిస్తోంది. వరుస ప్లాప్స్ లో ఉన్న రవితేజకు బలుపుతో మంచి హిట్ కొట్టింది. అల్లు అర్జున్ తో రేసుగుర్రం, రామ చరణ్ తో ఎవడు, మహేష్ తో శ్రీమంతుడు ఇలా వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మళ్లీ క్రాక్ తో సూపర్ హిట్ కొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేవలం నటిగానేకాదు సింగర్ గా మ్యూజిక్ కంపోజర్ గా కూడా శృతి ఇప్పటికే తన టాలెంట్ ను చూపించింది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో వున్నప్పుడే సినిమాలకు దూరమైంది శృతి. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. దానికి రిలేషన్ షిప్ లో ఉండటం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక బ్రేకప్ తర్వాత గ్యాప్ తీసుకున్న శృతి మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుంది. దీనితో పాటు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. దీనితోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సలార్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

మరి ఇప్పటి వరకూ శృతి నటించిన కొన్ని సినిమాల్లో శృతి బెస్ట్ జోడీ ఎవరో మీ ఓటు ద్వారా తెలపండి.

శృతి హాసన్ బెస్ట్ జోడి..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + sixteen =