‘చావు కబురు చల్లగా’ రిలీజ్ డేట్ ఫిక్స్

Chaavu Kaburu Challaga Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Challaga Movie,Chaavu Kaburu Challaga Telugu Movie,Chaavu Kaburu Challaga Release Date,Karthikeya,Actor Karthikeya,Hero Karthikeya,Karthikeya Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Challaga Release Date Out,Chaavu Kaburu Challaga Release Date Fix,Chaavu Kaburu Challaga Release Date Announced,Lavanya Tripathi,Chaavu Kaburu Challaga On March 19th,Chaavu Kaburu Challaga Release Date Confirmed

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత సినిమాల్లో నటించిన ఆశించినంత విజయం అందించలేకపోయాయి. ఈ మధ్య గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా కూడా తన టాలెంట్ ను చూపించాడు. ఈ పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ‘చావు కబురు చల్లగా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, ‘బస్తీ బాలరాజు’ క్యారెక్టర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవ్వగా.. ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 19 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =