100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Central Government Gives Approval For Hundred Percent Occupancy In Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Central Government,Theatres,Increase Theatre Occupancy,Cinema Halls,Cinema Halls In Telangana,Hyderabad Theatres,Theatre Occupancy,Theatre Occupancy Increase,Movie Industry,Theatres Bookings,Cinema Bookings,Government Green Signal,Central Government Approval,Hundred Percent Occupancy In Theatres,Hundred Percent Theatres Occupancy,Theatres Occupancy News

సినీ పరిశ్రమకు మరో గుడ్ న్యూస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్స్ తెరిచినా ఇప్పటివరకూ 50 శాతం అక్యుపెన్సీ తో నడిపించాలనే షరతులు ఉన్నాయి. ఆ మధ్య సంక్రాంతి పండుగ సీజ‌న్‌లో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ కేంద్ర ప్ర‌భుత్వానికి పూర్తి సీటింగ్ కెపాసిటీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసినా, రాష్ట్ర ముఖ్య‌మంత్రులు ప్రత్యేకంగా వంద శాతం థియేట‌ర్స్‌ను ఓపెన్ చేసుకోమ‌ని చెప్పినా కేంద్ర ప్ర‌భుత్వం ఒప్పుకోలేదు. ఇక ఇటీవల మరికొద్దిగా ఎక్కువ శాతం అక్యూపెన్సీ ని పెంచుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఎంత శాతం అనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా సమాచారం ప్రకారం 100 శాతం ఆక్యూపెన్సీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్ల‌ను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది. అయితే కొన్ని షరతులు మాత్రం విధించింది. సోషల్ డిస్టెన్స్, మాస్కులు, శానిటైజ‌ర్లు, టెంప‌రేచ‌ర్ చెకింగ్‌లు, షో టైమింగ్స్‌, బుకింగ్స్‌లో మార్పులు చేయాల‌ని కేంద్రం ఆదేశించింది. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి ఇది అమలులోకి రానుంది.

మరి ఒక రకంగా సినీ పరిశ్రమకు కాస్త ఊరట కలిగించే వార్తే. మరి గతంలో లాగ పూర్తి శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ప్రేక్షకులు సినిమాలతో కళకళలాడాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.