గత ఏడాది కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.. థియేటర్స్ మూత పడ్డాయి కానీ టాలీవుడ్ లో ఎప్పుడూ జరగనన్ని పెళ్లిళ్లు మాత్రం జరిగాయి. నితిన్, అఖిల్, రానా, మెగా డాటర్ నిహారిక, దిల్ రాజు, సాహో డైరెక్టర్ సుజీత్ ఇలా చాలా మంది పెళ్లి పీటలెక్కారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ ఏం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమంత్ అశ్విన్ పెళ్లి ఫిబ్రవరి 13న జరగబోతుంది. దీపిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఏం.ఎస్ రాజు అధికారికంగా తెలిపారు. మీరు దూరంగా ఉన్నప్పటికీ.. నూతన దంపతులకు మీ ప్రేమ ఆశీర్వాదాలు అందుతాయని ఆశిస్తున్నాం అంటూ ఎంఎస్ రాజు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ లోనే జరగనున్న ఈ వివాహ వేడుకను అతి కొద్ది మంది సమక్షంలో మాత్రమే జరపనున్నారట. ఇరు కుటుంబ సభ్యులు.. వారితో పాటు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.
We’re immensely Happy to announce the wedding of our son Chi. #Sumanth with Chi. #Deepika on Feb 13th 2021.
Given the unusual times, the wedding is going to be a very private affair. Although we deeply miss ur presence, we shall rejoice your love & blessings to the newly weds ❤️ pic.twitter.com/mU3lPZibs3
— MS Raju (@MSRajuOfficial) February 3, 2021
కాగా ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుమంత్ అశ్విన్. అయితే సుమంత్ సినీ కెరీర్ మాత్రం ఆశించినంత ఫామ్ లో లేదనే చెప్పొచ్చు. ‘అంతకు ముందు ఆ తరువాత’, ‘లవర్స్’ సినిమాలు మాత్రం అతడికి కమర్షియల్ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టాయి. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి ‘ఇదే మా కథ’ లో నటిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: