శివ కార్తికేయన్ ‘డాక్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Doctor Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Doctor From March 26,Doctor,Doctor Movie,Doctor Film,Doctor Release Date,Sivakarthikeyan,Hero Sivakarthikeyan,Actor Sivakarthikeyan,Sivakarthikeyan Doctor,Doctor Movie Release Date,Doctor Movie Release Date Out,Doctor Movie Release Date Fix,Doctor Movie Release Date Announced,Doctor Movie Release Date Confirmed,Doctor Release Date Out,Sivakarthikeyan Doctor Release Date,Doctor Release On March 26th

‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. దానితో తన సినిమాలు కూడా తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం కార్తికేయ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘డాక్టర్’ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రం మార్చి 26న థియేటర్స్‌లో విడుదల కానున్నట్లుగా అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. చేతికి రక్తంతో నిండిన గ్లౌజులు, శివ కార్తికేయ సీరియస్‌ లుక్‌లో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. యోగిబాబు, వినయ్ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను శివకార్తికేయన్, కేజేఆర్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇక ‘డాక్టర్‌’తో పాటు ఆర్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్‌’ చేస్తున్న శివ కార్తికేయన్.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ కూడా రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమాకు ‘డాన్’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు కూడా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =