
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 88

'సలార్' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
శ్రీకారం టీజర్ కు టైం ఫిక్స్
ప్రభాస్ 'మిర్చి'కి 8 ఏళ్లు
ప్రస్తుతం వారి కోసమే ప్రార్ధనలు - మహేష్
సూర్య కు కరోనా పాజిటివ్
చిన్న బ్రేక్ అంటున్న రామ్
బన్నీ కార్వాన్కు ప్రమాదం
'గతం' డైరెక్టర్ తో రాజశేఖర్ 92 సినిమా
సామ్@15 మిలియన్స్ - ఫ్యాన్స్ కి థ్యాంక్స్
'పుష్ప' రెండు షెడ్యూల్స్ పూర్తి
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సమ్మర్ కి వాయిదా
'నాంది' ట్రైలర్ రిలీజ్-జీవితం ఇప్పుడే మొదలైంది
పవన్ సినిమా - గోల్డెన్ ఫిలిం
'నిన్నిలా నిన్నిలా' ట్రైలర్ రిలీజ్

'ఇదే మా కథ' రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన శృతి
'నాంది' రిలీజ్ డేట్ ఫిక్స్

2021 'మెగా' సినిమాలు
కరోనా ఎఫెక్ట్ తో గత ఏడాది రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు ఈ ఏడాదికి షిఫ్ట్ అయిపోయాయి. అందుకే షూటింగ్ అయిపోయిన సినిమాలు..అవ్వని సినిమాలు.. షూటింగ్ మొదలుకాని సినిమాలు ఇలా చాలా వరకు ముందుగానే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 40కి పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అంతేకాదు ఈఏడాది మొత్తం మెగా హీరోల హవానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్ నుండే దాదాపు అరడజను సినిమాలకు పైగా రానున్నాయి.
'సలార్' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాపిడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. అలా మొదలుపెట్టాడో లేదో ఇలా 'సలార్' ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశాడు. ప్రభాస్ హీరోగా కె.జి.యఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇన్నిరోజులు తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో మొదటి షెడ్యూల్ ను జరుపుకుంది. ఇక అక్కడ హీరో ప్రభాస్, శృతిహాసన్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
శ్రీకారం టీజర్ కు టైం ఫిక్స్
కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పలు సాంగ్స్, పోస్టర్స్ లాంటివి ఇప్పటికే రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక టీజర్ అప్డేట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ 'మిర్చి'కి 8 ఏళ్లు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విజయవంతమైన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేసాడు. వాటిలో 'మిర్చి' ఒకటి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన తొలి చిత్రమిది. రచయిత నుండి దర్శకుడిగా మారిన ఈ సినిమాతో... శివ మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేయడం విశేషం.
ప్రస్తుతం వారి కోసమే ప్రార్ధనలు - మహేష్
సినిమాలు, ఫ్యామిలీ కేవలం వ్యక్తిగత విషయాలే కాదు అప్పుడప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ విషాదంపై కూడా స్పందించి విచారం వ్యక్తం చేసాడు సూపర్ స్టార్ మహేష్. ఉత్తరాఖండ్‌లో సంభవించిన ధౌలిగంగా విషాదం అందరినీ కలిచివేస్తుంది. హిమాలయ మంచుకొండలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఉప్పొంగిన దౌలీగంగా నదికి వరద ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ ప్రవాహంతో 170 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాకుండా చేసింది. ఇప్పటి వరకూ 10 శవాలను వెలికి తీయగా.. అతికష్టం మీద 16 మంది రక్షించగలికారు సహాయ సిబ్బంది.
సూర్య కు కరోనా పాజిటివ్
ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సామాన్య స్థితికి వస్తున్నాయి.. ప్రజలు కూడా కాస్త భయం పోయి బయట తిరుగుతున్నారు.. అయితే కరోనా మాత్రం అప్పుడప్పుడు నేనున్నాని ఇంకా గుర్తుచేస్తూనే ఉంది. గత ఏడాది కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి.. ఇంట్లో నుండి అడుగు బయటపెట్టలేని పరిస్థితి. ఎంతో మంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. పస్తులతో ఉన్నారు.. ఈ సమయంలోనే ఎంతోమంది దాతలు కూడా ముందుకు వచ్చి సాయం చేశారు.
చిన్న బ్రేక్ అంటున్న రామ్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చి ఇటీవల విడుదలైన 'రెడ్' సినిమాతో మరోహిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇక తన తర్వాత సినిమా గురించిన అప్ డేట్ ఇంకా ఇవ్వలేదు. మరోవైపు అభిమానులు తమ హీరో ఎవరితో చేస్తాడో.. దానికి సంబంధించిన అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు రామ్ చిన్న షాకే ఇచ్చాడు.
బన్నీ కార్వాన్కు ప్రమాదం
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నట్టు పుష్ప టీం ఈరోజే ప్రకటించింది. మారేడు మిల్లి, రంపచోడవరంలలో ఇప్పటివరకూ షూటింగ్ జరుపుకుంది. ఇక షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్ కు ప్రమాదం జరిగింది. ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఒక లారీ వచ్చి ఢీకొట్టడంతో వెనుక భాగం దెబ్బతింది. అయితే కార్వాన్ లో ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
'గతం' డైరెక్టర్ తో రాజశేఖర్ 92 సినిమా
కల్కీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రీసెంట్ గానే రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా అయన 91వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'శేఖర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.
సామ్@15 మిలియన్స్ - ఫ్యాన్స్ కి థ్యాంక్స్
ఏరంగంలో అయినా అక్కినేని కోడలు సమంత విజయమే దక్కించుకుంటూ వెళ్తుంది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాములుగా ఉండదు. ఇక సమంత కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే సోషల్ మీడియా క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది. తన వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉంటుంది. అందుకే రోజు రోజుకు ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటూ పోతూనే ఉంది. సామ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.50 కోట్లను దాటడమే అందుకు నిదర్శనం.
'పుష్ప' రెండు షెడ్యూల్స్ పూర్తి
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో ఫుల్ మాస్, రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సమ్మర్ కి వాయిదా
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సీజన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి కూడా విదితమే. కానీ ఎదురుచూపులకు తగ్గట్టు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది. ఫైనల్లీ ఇటీవలే ఫిబ్రవరి 12 రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.. టీజర్ కూడా రిలీజ్ చేశారు. దీనితో ఆ డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో మళ్లీ…
'నాంది' ట్రైలర్ రిలీజ్-జీవితం ఇప్పుడే మొదలైంది
ఇప్పటి వరకూ ఎక్కువ శాతం కామెడీ సినిమాలతో అలరించిన నవ్వించిన అల్లరి నరేష్ మొదటిసారి సీరియస్ పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్.
పవన్ సినిమా - గోల్డెన్ ఫిలిం
అందం, అభినయం ఉన్నా కొంతమంది హీరోయిన్స్ కు ఎందుకో సక్సెస్ అంత తొందరగా రాదు. దానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పొచ్చు. పాపం ఈ భామకి వరుసగా చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ ఆ ఇచ్చాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మొత్తానికి హిట్ కొట్టింది. అయితే ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం పలు అవకాశాలు వస్తూనే వున్నాయి. ప్రస్తుతం తెలుగు తమిళ్ లో పలు సినిమాలు చేసుకుంటుంది.
'ఆర్ఆర్ర్' క్లైమాక్స్ రిహార్సల్స్ లో ఎన్టీఆర్, చరణ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల దాదాపు షూటింగ్ కు చాలా గ్యాప్ రాగా ఇప్పుడు అసలు బ్రేక్ లేకుండా రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ లోపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ లను అయితే రిలీజ్ చేశారు. వాటికి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి.
'నిన్నిలా నిన్నిలా' ట్రైలర్ రిలీజ్
మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పేరు 'నిన్నిలా నిన్నిలా'. ప్రముఖ తమిళ నటుడు, 'పిజ్జా 2' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ , టీజర్ విడుదల కాగా వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

'ఇదే మా కథ' రిలీజ్ డేట్ ఫిక్స్
గురుపవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మా కథ. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నలుగురు వ్యక్తులు కలిసి రోడ్ ట్రిప్ ను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథ. ఇప్పటికే రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ‘ఇదే మా కథ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. దీనితో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన శృతి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో మొదలుపెట్టారు.
'సర్కారు వారి పాట' లొకేషన్స్ కు మహేష్ ఫిదా
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడి షూటింగ్ కు సంబంధించి పలు ఫొటోలు.. లొకేషన్స్ కు సంబందించిన ఫొటోలు ఇప్పటికే మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా అవి వైరల్ అవుతున్నాయనుకోండి.
'నాంది' రిలీజ్ డేట్ ఫిక్స్
కామెడీ హీరోగానే కెరీర్ ను ప్రారంభించిన అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలే కాదు నేను, గమ్యం, శంభో శివ శంభో ఈమధ్య కాలంలో వచ్చిన మహర్షి సినిమాలో చేసిన పాత్ర ఇలా కొన్ని గుర్తుండిపోయే పాత్రలు చేసాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి సీరియస్ పాత్రతో మనముందుకు వచ్చేస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.