టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో నితిన్ కూడా ఒకడని అతను చేసిన సినిమాలను చూస్తే చెప్పొచ్చు. ఇక గత ఏడాది భీష్మ తో హిట్ కొట్టిన నితిన్ చెక్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేటట్లే కనిపిస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో చెక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ ను చూస్తే నితిన్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టడం పక్కా అన్న టాక్స్ అప్పుడే వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
‘యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు’ అని మురళీ శర్మ వాయిస్‌తో మొదలైన ట్రైలర్ చివరి వరకూ ఆసక్తికరంగానే ఉంది. ‘ఒక టెర్రరిస్ట్‌తో చెస్ ఆడిస్తారా’, రాజును ఎదిరించే ధైర్యం ఉందా సిపాయి కి అంటే యుద్ధం మొదలయ్యేదే సిపాయితో అని నితిన్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దేశ ద్రోహం కేసు కింద జైల్లో అడుగుపెట్టిన నితిన్ కు అక్కడ ఇతర ఖైదీలతో కూడా సమస్యలు తలెత్తుతాయని.. వాటిని నితిన్ ఛేదిస్తాడని అర్ధమవుతుంది. అంతేకాదు చెస్ ఆడటంలో తనకున్న నైపుణ్యంతోనే ఆ కేసు నుండి ఎలా బయటకు వస్తాడనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో నితిన్ ను కేసు నుంచి బయట పడేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకవైపు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్‌తో రొమాంటిక్ యాంగిల్‌ను కూడా ట్రైలర్లో టచ్ చేశారు. ఇక విభిన్నమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన స్క్రీన్ ప్లే తోనే మాయ చేస్తాడు. ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ కనిపిస్తుంది. మరోవైపు కల్యాణీ మాలిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్లస్ అయ్యింది.
కాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా సిమ్రన్ చౌదరి, పోసాని కృష్ణమురళి, సాయిచంద్, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, చైతన్య కృష్ణ, కార్తీక్ రత్నం కీలక పాత్రల్లో నటించారు. కల్యాణిమాలిక్ ఈ సినిమాకు సంగీతం అందించగా..సినిమాటోగ్రఫీ రాహుల్ శ్రీవాత్సవ్ అందించాడు. ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదల కానుంది.
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.