సాయి ధరమ్ తేజ్‌కు `ప్రతీరోజు పండగే` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి మరో కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. ఇటీవలే గోపీచంద్ తో తన తర్వాత సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఇక ఇంకా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.. షూట్ మొదలుపెట్టలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించారు. గత రెండు వారాలుగా అందరూ సినిమా రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు అందరికంటే విభిన్నంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 1నరిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ… అందరికీ చాలా థాంక్సండీ..! రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఏదో కొత్తగా ట్రై చేద్దామని మేము చేసిన ప్రయత్నాన్ని యాక్సప్ట్ చేసి, మంచి బూస్టప్ ఇచ్చిన ఇండస్ట్రీ, మీడియా మరియు ప్రేక్షక దేవుళ్ళందరికీ చాలా థాంక్సండీ. మా ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో హీరో గోపీచంద్ మరియు దర్శకుడు మారుతిల కాంబినేషన్‌లో త్వరలో షూటింగ్ మొదలుపెట్టి.. చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేయగలమని హామీ ఇస్తున్నాం. ఇలాగే మేము చేసే ప్రతి ప్రయత్నం మీకు నచ్చి మీరు మెచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. మీ.. యూవీ క్రియేషన్స్ మరియు జిఎ2 సంస్థలు అంటూ కాస్త వెరైటీగా నే ట్రై చేశారు.
As there is RUSH in release dates of movies, we thought of reserving our Seat 💺 even before the announcement of our Title & First Look!#Gopichand29 Grand Release on Oct 1st 2021. Shoot begins from March 🎬 @YoursGopichand @DirectorMaruthi #BunnyVas @UV_Creations @GA2Official pic.twitter.com/VIxhj3ABMx
— GA2 Pictures (@GA2Official) February 3, 2021
కాగా గీతా-2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్.. ఇతరనటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: