
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 86

చరణ్ తో శంకర్ సినిమా.. థ్రిల్లింగ్ గా ఉంది
'జాతి రత్నాలు' టీజర్ రిలీజ్
మెగా న్యూస్.. చరణ్-శంకర్ సినిమా కన్ఫామ్
'శ్యామ్ సింగ రాయ్' కోల్‌కతా షెడ్యూల్ ప్రారంభం
సందీప్ కిషన్ 'రౌడీ బేబీ' షూటింగ్ పూర్తి
ఉప్పెన మూవీ పబ్లిక్ టాక్
శ్రీ సింహా 'తెల్లవారితే గురువారం' రిలీజ్ డేట్ ఫిక్స్
'రాధే శ్యామ్' ఫస్ట్ గ్లింప్స్ కు టైం ఫిక్స్
దిల్ రాజు 'షాదీ ముబారక్' రిలీజ్ డేట్ ఫిక్స్

సత్య దేవ్ 'గాడ్సే' షూటింగ్ ప్రారంభం
'గాలి సంపత్' షూటింగ్ పూర్తి
'ఉప్పెన' - ఈ రీజన్స్ చాలు సినిమా చూడటానికి

సెన్సార్ పూర్తి చేసుకున్న ఉప్పెన
'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్

2020 మోస్ట్ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్ ఇండియన్స్ లిస్ట్‌లో అల్లు అర్జున్
ఎప్పడూ ఏదో ఒక సర్వే జరుగుతూనే ఉంటుంది. అందులో మన సెలెబ్రిటీస్ చోటు దక్కించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. 2020 మోస్ట్ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్ ఇండియన్స్ లిస్ట్‌లో అల్లు అర్జున్ చోటు దక్కించుకోవడం గొప్ప విషయం. 2020లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 25 మంది వ్యక్తులను జిక్యూ ఇండియా ప్రకటించింది. అందులో అల్లుఅర్జున్ కూడా చోటు దక్కించుకున్నాడు. దానికి కారణం మరేదో కాదు 'అల వైకుంఠపురములో' సినిమానే. త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో తెలుసు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశాలు…
చరణ్ తో శంకర్ సినిమా.. థ్రిల్లింగ్ గా ఉంది
శంకర్ సినిమా అంటే ఎన్ని అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక మేసేజ్ తో పాటు..ఎంతో వైవిధ్యంగా.. కొత్తగా తెరకెక్కించడంలో డైరెక్టర్ శంకర్ రూటే వేరు. ఇప్పటి వరకూ తాను చేసిన అన్ని సినిమాలు మంచి ఘనవిజయం సాధించడానికి కూడా అదే కారణం.ఇక శంకర్ సినిమాలో నటించడానికి హీరో హీరోయిన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు.
'జాతి రత్నాలు' టీజర్ రిలీజ్
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో జాతి రత్నాలు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.
'వరుడు కావలెను' నుండి వాలెంటైన్స్ డే కి ఫస్ట్ సింగిల్
ప్రస్తుతం నాగశౌర్య వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో వున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం నాలుగైదు సినిమాలు నాగశౌర్య లిస్ట్ లో వున్నాయి. వాటిలో ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మెగా న్యూస్.. చరణ్-శంకర్ సినిమా కన్ఫామ్
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోపక్క కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ పై ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఎవరితో సినిమా ఉంటుందన్న క్లారిటీ లేదు. అయితే కొద్దిరోజులుగా రామ్ చరణ్ తర్వాత సినిమా శంకర్ తో ఉంటుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మాత్రం సడెన్ గా మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రామ్ చరణ్, శంకర్ తో…
'శ్యామ్ సింగ రాయ్' కోల్‌కతా షెడ్యూల్ ప్రారంభం
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన కొత్తగా మేకోవర్ అయ్యారు కూడా.
సందీప్ కిషన్ 'రౌడీ బేబీ' షూటింగ్ పూర్తి
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

రివ్యూ .. ప్రేమ, సంఘర్షణల 'ఉప్పెన'
ఇక ఈ సినిమాకు మొదటినుండి మరో హైలెట్ ఏంటంటే.. దేవిశ్రీ ప్రాసాద్ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. తన బీజీయంతో సినిమాకు ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పిన ఈ 'ఉప్పెన' అందరికీ నచ్చుతుంది.
ఉప్పెన మూవీ పబ్లిక్ టాక్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఈ రోజు అనగా ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందుతుంది. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో కింది వాటిలో వీక్షించగలరు .
శ్రీ సింహా 'తెల్లవారితే గురువారం' రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతూ వచ్చిన సినిమా ‘మత్తు వదలరా’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం దక్కించుకోడమే కాదు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇక ఇప్పుడు శ్రీసింహా తన రెండో సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు.
'రాధే శ్యామ్' ఫస్ట్ గ్లింప్స్ కు టైం ఫిక్స్
ప్రభాస్, పూజా హెగ్డేల ప్రేమ కావ్యానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా వస్తున్నసంగతి తెలిసిందే. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. పూజా హెగ్డే .. ప్రేరణ అనే పాత్రలో కనిపించనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తాజాగా టైం కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 14 ఉదయం 9.18 ని.లకు సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్టు తెలియచేస్తూ ప్రభాస్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రీ టీజర్ లో తన లుక్ తో అదరగొట్టిన ఈ పోస్టర్ లో తన క్లాస్ లుక్ తో మరోసారి…
'సర్కారు వారి పాట' మూడో కంపోజిషన్ కంప్లీట్
వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు థమన్. దాదాపు డజనుకు పైగా సినిమాలు థమన్ ఖాతాలో ఉన్నాయి. ఇక తన వర్క్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాడు. ప్రస్తుతం థమన్ సర్కారు వారి పాట సినిమా మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇకతాజాగా ఈ సినిమా పాటలకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు.ఈసినిమాకు సంబంధించి మూడో కంపొజిషన్ సెషన్స్ కంప్లీట్ అయ్యాయని.. డైరెక్టర్ పరుశురాం.. సినిమాటోగ్రాఫర్ మది తో ఉన్న ఫొటో ను పోస్ట్ చేసాడు.
దిల్ రాజు 'షాదీ ముబారక్' రిలీజ్ డేట్ ఫిక్స్
ఆర్కే నాయుడు.. కాస్త సీరియల్స్ చూసే అలవాటు ఉన్నవారికి వెంటనే ‘మొగలిరేకులు’ సీరియల్ గుర్తుకొస్తుంది. ఈ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ నటించిన సంగతి తెలిసిందే. సాగర్ కంటే ఆర్కే నాయుడుపేరే ఫిక్స్ అయిపోయింది తనకి. ఆ సీరియల్ సాగర్ కు తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక హీరోకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో దాదాపు ఈ పాత్ర ద్వారా సాగర్ కు కూడా అలాంటి క్రేజే దక్కింది. ఇక ఆ గుర్తింపుతో అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటించాడు.. అంతేకాదు ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది అనుకోండి.
'రాధే శ్యామ్' - సౌత్, నార్త్ మ్యూజిక్ డైరెక్టర్స్ కన్ఫామ్
ఈ మధ్య రాధే శ్యామ్ టీమ్ అసలు ఎలాంటి హింట్ లేకుండా అప్ డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఫిబ్రవరి 14 న అప్ డేట్ ఉందంటూ ఊహించని విధంగా అప్ డేట్ ఇస్తూ ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే ఈ చిత్రం టీజర్ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా రాధే శ్యామ్ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా జస్టిన్ ప్రభాకరన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే జస్టిన్ ప్రభాస్ సౌత్ లాంగ్వేజస్ కు మాత్రమే సంగీతం అందించనున్నాడు. అంటే తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం…

సత్య దేవ్ 'గాడ్సే' షూటింగ్ ప్రారంభం
యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సత్య దేవ్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో కలిసి ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై నిర్మాత సృజన్ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'గాలి సంపత్' షూటింగ్ పూర్తి
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్‌లో చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 11న మహాశివరాత్రి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నాం’’ అని ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
'ఉప్పెన' - ఈ రీజన్స్ చాలు సినిమా చూడటానికి
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. దానికితోడు చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం.

'ఎన్టీఆర్' తో ప్రశాంత్ నీల్ సినిమా - కన్ఫామ్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత
'ఎన్టీఆర్' తో ప్రశాంత్ నీల్ సినిమా.. ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా..ఉండదా అనేది గతకొంత కాలంగా నడుస్తున్న సస్పెన్స్. కె.జి.యఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తాడని.. ఎన్టీఆర్ చేస్తాడని ఆ మధ్య వార్తలు రాగా.. ఆ వార్తలకు క్లారిటీ ఇస్తూ ప్రభాస్ తో సినిమా కన్ఫామ్ చేసాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు ప్రభాస్, ప్రశాంత్ నీల్. ఇక ఇదిలా ఉండగా మరోసారి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలే.
సెన్సార్ పూర్తి చేసుకున్న ఉప్పెన
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. నిజానికి గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉండడంతో విడుదల కాలేదు. ఈ లోపు ఈ సినిమాకు నీ కళ్లు నీలి సముద్రం అన్న పాట కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కోసం మంచి క్యూరియాసిటీతోనే ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దానికి ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ పెంచిన అంచనాలే కారణం. అంతేకాదు వర్సటైల్ యాక్టర్ విజయసేతుపతి నెగిటివ్ పాత్ర చేయడం కూడా ఒక కారణం. ఇంకా ఈ సినిమా రిలీజ్ ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎలాగూ సినిమా హిట్…
'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్
వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న సినిమా 'లైగర్'. మొన్నీమధ్య ఈ సినిమా టైటిల్ ను ప్రకటించడం తప్పా.. పెద్దగా అప్ డేట్స్ ఏమీ ఇచ్చింది లేదు. ఇక చాలా కాలం నుండి మంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న రౌడీ హీరో ఫ్యాన్స్ కు ఉదయాన్నే మంచి వార్త చెప్పారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకోగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామని చెప్పినసంగతి తెలిసిందే కదా.. ఇక చెప్పినట్టే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల…