అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో జాతి రత్నాలు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నవీన్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి జైలులో ఖైదీలుగా నడచుకుంటూ రావడంతో టీజర్ మొదలవుతుంది. సెల్‌లో నుంచి ప్రియదర్శి తనవైపు ముగ్గురు ఉన్నారని.. వారు తమన్నా, సమంత అని చెప్పి, మూడో పేరు కోసం తడుముకుంటుంటే రష్మిక అని అందిస్తాడు నవీన్. ఇలా మంచి కామెడీ తో సినిమా ఉండబోతుందని అర్ధమవుతుంది. అలానే ఒక లవ్ స్టోరీ తో పాటు 500 కోట్ల చుట్టూ తిరిగే ఒక సీరియస్ వ్యవహారం చుట్టూ కథ తిరుగుతుందని అర్ధమవుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: