2020 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో అల్లు అర్జున్

Stylish Star Allu Arjun Finds Place In 2020 Most Influential Young Indians List,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Stylish Star Allu Arjun,Allu Arjun,Hero Allu Arjun,Actor Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun Finds Place In 2020 Most Influential Young Indians In 2020 Most Influential Young Indians List,Allu Arjun Listed In Most Influential Young Indians of 2020,Allu Arjun In Most Influential Young Indians List,Allu Arjun Listed In GQ 25 Most Influential Young Indians,GQ 25 Most Influential Young Indians 2020,GQ India,GQ 25 Most Influential Young Indians 2020,Allu Arjun Place In 2020 Most Influential Young Indians

ఎప్పడూ ఏదో ఒక సర్వే జరుగుతూనే ఉంటుంది. అందులో మన సెలెబ్రిటీస్ చోటు దక్కించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. 2020 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో అల్లు అర్జున్ చోటు దక్కించుకోవడం గొప్ప విషయం. 2020లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 25 మంది‌ వ్యక్తులను జిక్యూ ఇండియా ప్రకటించింది. అందులో అల్లుఅర్జున్ కూడా చోటు దక్కించుకున్నాడు. దానికి కారణం మరేదో కాదు ‘అల వైకుంఠపురములో’ సినిమానే. త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో తెలుసు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశాలు కాదు ఖండాలు దాటి మరి ఈ పాటలు పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ‘రాములో రాములా’ సాంగ్‌ మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ పాట ఫుల్‌ వీడియో ఇప్పటి వరకు 300 మిలియన్లు సాధించింది. ఇక ఇదే జిక్యూ ఇండియా మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో స్థానం కల్పించేలా చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా నివేత పేతురాజ్ నటిస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.