శంకర్ సినిమా అంటే ఎన్ని అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక మేసేజ్ తో పాటు..ఎంతో వైవిధ్యంగా.. కొత్తగా తెరకెక్కించడంలో డైరెక్టర్ శంకర్ రూటే వేరు. ఇప్పటి వరకూ తాను చేసిన అన్ని సినిమాలు మంచి ఘనవిజయం సాధించడానికి కూడా అదే కారణం.ఇక శంకర్ సినిమాలో నటించడానికి హీరో హీరోయిన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇక చిరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. క్రాఫ్ట్, విజనరీ, సరిహద్దులను దాటడంలో మార్గదర్శకుడు శంకర్‌తో రాంచరణ్ సినిమా చేస్తుండటం థ్రిల్ కలిగించే విషయం. ఇండియన్ సినిమా ఖ్యాతిని చాటిచెప్పిన పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో నువ్వు వరుసగా సినిమాలు చేస్తుండటం చాలా అందాన్నిచ్చే విషయం అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు చిరు.
Thrilled about @AlwaysRamCharan joining hands with @shankarshanmugh master of the craft,visionary & a pioneer in transcending boundaries.Happy that your consecutive films are with passionate directors who strive to raise the bar for #IndianCinema. Good Luck! #RC15 #SVC50 https://t.co/8yCUbys54q
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 12, 2021
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోపక్క కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ శంకర్ సినిమా మొదలు పెడతాడేమో చూడాలి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా తెరకెక్కబోతుంది.. ఇతర నటీనటిల వివరాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: