ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతూ వచ్చిన సినిమా ‘మత్తు వదలరా’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం దక్కించుకోడమే కాదు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇక ఇప్పుడు శ్రీసింహా తన రెండో సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Crazy roles, crazy fun!🥳
Catch the fun packed #ThellavaritheGuruvaram from March 27th, in your nearest theatres!@Simhakoduri23 @gellimanikanth @kaalabhairava7 @SaiKorrapati_ @Benny_Muppaneni @VaaraahiCC @Loukyaoffl @Chitrashukla73 @NarangMisha @sureshragutu1 @Nagendrapilla2 pic.twitter.com/wYv8V1MX5f
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) February 11, 2021
ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష, శరణ్యా ప్రదీప్, గిరిధర్, ప్రియ, రవివర్మ, పార్వతి, సిరి హనుమంత్, మౌర్య, పద్మావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కలర్ ఫొటో’ లాంటి మంచి సినిమాను అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన కాలభైరవానే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: