ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 87

వాళ్లిద్దరితో నటించడం చాలా హ్యాపీ
'టక్ జగదీష్' నుండి రాబోతున్న మ్యాజికల్ మెలోడీ
సత్య దేవ్ 'క్యూట్ ఫ్యామిలీ'
'లైగర్' క్రేజీ అప్ డేట్
'నాట్యం' టీజర్ రిలీజ్

5ఏళ్ల నుండే ఆ సమస్య ఉంది
'రాధే శ్యామ్' టీజర్ కోసం డబ్బింగ్

వాళ్ల వల్లే హీరో అయ్యాను
శర్వానంద్ 'శ్రీకారం' టీజర్ రిలీజ్
'కార్తికేయ 2' రెడీ టూ షూట్
'విజయ రాఘవన్' షూటింగ్ పూర్తి
జైసల్మేర్ లో 'సీటీమార్' టీమ్
ఏఎన్నార్ దత్త పుత్రుడు - హ్యాపీ బర్త్ డే సుమంత్
'అనగనగా ఒక రౌడీ' - 'వాల్తేరు శీను' గా సుమంత్

పవన్ కు థమన్ 5స్టార్స్

కన్ఫామ్.. మెగా స్టార్ తో బాబి సినిమా
ప్రముఖ నిర్మాణ సంస్థకు 'చెక్' నైజాం హక్కులు
అల్లరి నరేష్ 'నాంది' నుండి 'చెలి' సాంగ్ రిలీజ్
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే ఈ రిలీజ్ చేసిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ కూడా తొందర్లోనే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు.

వాళ్లిద్దరితో నటించడం చాలా హ్యాపీ
వివాహం తర్వాత కూడా సమంత సినిమాలు, వెబ్ సిరీస్, షోలు, మరోపక్క బిజినెస్ అంటూ బిజీ బిజీ గా తన కెరీర్‌ను కొనసాగిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత ఒక హీరోయిన్ ఇంత బిజీ గా ఉందంటే ఆ క్రెడిట్ సమంతకు ఇవ్వొచ్చు. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వెడ్డింగ్ యానివర్సరీ.. మహేష్-నమ్రత ప్రేమకు 16యేళ్లు
ఒక్క సినిమాతోనే ప్రేమలో పడ్డారు.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో ముందు ఉంటారు..ఆ జంట ఎవరో ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటది.. ఇంకెవరూ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు స్వీట్ గా విషెస్ చెప్పుకున్నారు.
'టక్ జగదీష్' నుండి రాబోతున్న మ్యాజికల్ మెలోడీ
డిఫరెంట్ కథలను చేయడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి 'టక్ జగదీష్'. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అంతేకాదు చాలా కాలం తర్వాత మళ్లీ మాస్ అండ్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు నాని. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫుల్ మాస్ లుక్ లో ఉన్న నాని స్టిల్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 23 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే…
సత్య దేవ్ 'క్యూట్ ఫ్యామిలీ'
‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్... ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న ఫ్రెండ్ పాత్రలే చేసాడు. ఇక పూరీ జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మీ’తో హీరోగా పరిచయం అయినా హీరో కు మాత్రం ఫిక్స్ కాకుండా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ పేరు కూడా చేరిపోయింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.
'లైగర్' క్రేజీ అప్ డేట్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. మళ్లీ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు రేపు ఉదయం 8 గంటల 14 నిమిషాలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు అధికారికంగా తెలిపారు.
'నాట్యం' టీజర్ రిలీజ్
రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు ప్రధాన పాత్రలో 'నాట్యం' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రామ్ చరణ్ సతీమణి ఉపాసన రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను చూస్తే టైటిల్ కు తగ్గట్టుగానే పూర్తిగా ‘నాట్యం’ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్టు అర్ధమవుతుంది. ‘ఒక కథను వింటాం కదా. అదే కథను కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటాం. నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం’ అంటూ ఆదిత్య మీనన్ చెప్పే డైలాగ్‌లతో…
ఫిబ్రవరి 14 న ఎలాంటి సాంగ్ లేదు - థమన్ క్లారిటీ
అందరూ ఏమో కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం వకీల్ సాబ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పవన్ క్రేజ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.. దానికితోడు అజ్ఞాతవాసి తర్వాత చాలా సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత చేస్తున్న సినిమా.. మరి దాదాపు మూడేళ్లు తన అభిమాన హీరోను వెండితెరపై చూసే ఛాన్స్ రాలేదు.. మరి ఇంకెలా ఉంటుంది. అందుకే 'వకీల్ సాబ్' కోసం అంతలా చూస్తున్నారు. ఈ ఎడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో వకీల్ సాబ్ కూడా నిలిచింది అంటే హవా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

5ఏళ్ల నుండే ఆ సమస్య ఉంది
ఒక్కప్పటి హీరోయిన్స్ లా కాదు ఇప్పుడున్న హీరోయిన్స్.. తమ కెరీర్ ను బిల్ట్ చేసుకోడంలో కానీ..ఆచితూచి అడుగులు వేయడంలో కానీ ఒక అడుగు ముందే ఆలోచిస్తూ జాగ్రత్తలు వహిస్తుంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా.. తమ అభిప్రాయాలను కూడా చెప్పడానికి అస్సలు మొహమాటం పడట్లేదు. ఇక ఇటీవలే శృతి హాసన్ తన సర్జరీ గురించి చెప్పిన సంగతి తెలిసిందే కదా... ఇక ఇప్పుడు కాజల్ కూడా తనకు చిన్నప్పటి నుండి ఉన్న సమస్యను చెపుతూ.. పలు సలహాలు కూడా ఇస్తుంది. ఇంతకీ కాజల్ కు ఉన్న సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటే అసలు స్టోరీ లోకి వెళ్తుంది.
'రాధే శ్యామ్' టీజర్ కోసం డబ్బింగ్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'రాధే శ్యామ్' సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రేమికుల రోజు టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పడంతో.. ప్రస్తుతం అయితే టీజర్ రిలీజ్ కోసం మాత్రం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టీజర్ కోసం వదిలిన చిన్న వీడియోకే మామూలు రెస్పాన్స్ రాలేదు. ప్రభాస్ లుక్.. దానికి తగ్గట్టు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అదిరిపోవడంతో మంచి ప్రేమ కథనే రాధాకృష్ణ వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్టు అర్ధమవుతుంది.

వాళ్ల వల్లే హీరో అయ్యాను
మెగా కాంపౌండ్ నుండి వస్తున్న మరో నటుడు వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఇక మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ చుసిన తర్వాత సినిమా పక్కా హిట్ అన్న టాక్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో మాత్రం తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
శర్వానంద్ 'శ్రీకారం' టీజర్ రిలీజ్
మంచి సినిమాలను.. నటనకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేసే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అతికొద్ది మంది నటీనటులలో శర్వానంద్ ఒకరు. 'జాను' సినిమా తర్వాత శర్వానంద్ 'శ్రీకారం' అనే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అది. ఈ సినిమాలో శర్వానంద్ రైతు పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది కూడా. మహాశివరాత్రి పండుగ నాడు మార్చి 11న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
'కార్తికేయ 2' రెడీ టూ షూట్
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే నిజానికి గత ఏడాది ఉగాది నుండే షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఇప్పుడు అన్ని సినిమాల షూటింగ్ లు మొదలవుతుండటంతో ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్రయూనిట్.
'విజయ రాఘవన్' షూటింగ్ పూర్తి
మెట్రో వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా విజయరాఘవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో 'కోడియిల్ ఒరువన్' గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో 'విజయ రాఘవన్'గా విడుదల చేస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
జైసల్మేర్ లో 'సీటీమార్' టీమ్
హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత ఏడాదే మొదలైంది. లాక్ డౌన్ కి ముందే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇంకా పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఏఎన్నార్ దత్త పుత్రుడు - హ్యాపీ బర్త్ డే సుమంత్
ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. కానీ వారి సినీ కెరీర్ మాత్రం తమలోని నటన.. సినిమాలను ఎంచుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది. ఇక తాత ఏయన్నార్ సినీ చరిత్రలోనే ఒక దిగ్గజం.. మామ నాగార్జున అగ్ర హీరో.. వారి ఆశీస్సులతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి వారసత్వ హీరో సుమంత్. తాత పోలికలు పుష్కలంగా పునికిపుచ్చుకున్న మనవడు సుమంత్. అంతేకాదు మొదటి వారసుడు కావడంతో సుమంత్ అంటే ఏయన్నార్ కి అమితమైన ప్రేమ. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా వుండే ఏఎన్నార్ కు ఒక సినిమా షూటింగ్ టైం లో హార్ట్ ఎటాక్ రావడంతో హార్ట్ సర్జరీ చేసారు. సర్జరీ జరినప్పుడు ఇంట్లోనే ఏడాది పాటు ఉండాల్సి వచ్చిందట. ఆ సమయంలోనే సుమంత్…
'అనగనగా ఒక రౌడీ' - 'వాల్తేరు శీను' గా సుమంత్
సుమంత్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా న థియేటర్ లో రిలీజ్ కానుంది.

పవన్ కు థమన్ 5స్టార్స్
దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొనివేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

కన్ఫామ్.. మెగా స్టార్ తో బాబి సినిమా
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను మే 13న రిలీజ్ చేయనున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థకు 'చెక్' నైజాం హక్కులు
చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా చెక్. చాలా డిఫరెంట్ కథతో వస్తున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాతో మరో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడన్న అభిప్రాయానికి వస్తున్నారు అందరూ . ఇక ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా పడింది. టీజర్ కు ట్రైలర్ కు మంచి టాక్ వచ్చి సినిమాపై అంచనాలు పెరిగితే ఆ సినిమా హక్కులు కూడా అదే రేంజ్ లో అమ్ముడుపోతాయన్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు చెక్ విషయంలో కూడా అదే జరిగింది.