ప్రస్తుతం నాగశౌర్య వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో వున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం నాలుగైదు సినిమాలు నాగశౌర్య లిస్ట్ లో వున్నాయి. వాటిలో ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. వాలెంటైన్స్ డే కి ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Here’s a Small Glimpse into the Melody of Love, Kola Kalle Ilaa…😍🤩
Lyrical video out on 14th Feb @ 04:05pm!❤#KolaKalleIlaa #VaruduKaavalenu @IamNagashaurya @riturv @LakshmiSowG @Composer_Vishal @sidsriram @gosala_lyricist @ganeshravuri @vamsi84 pic.twitter.com/EpEgdMoRyi
— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2021
ఈ చిత్రంతో పాటు రాజేంద్ర దర్శకత్వంలో ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్ ను ఇటీవలే ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.ఇంకా ‘అలా ఎలా’ సినిమా దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: