‘శ్యామ్ సింగ రాయ్’ కోల్‌క‌తా షెడ్యూల్ ప్రారంభం

Natural Star Nani Shyam Singha Roy Movie Team To Kick Start New Schedule In Kolkata,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Nani,Natural Star Nani,Actor Nani,Hero Nani,Nani Shyam Singha Roy,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Latest Updates,Shyam Singha Roy Kolkata New Schedule Begins,Shyam Singha Roy Kolkata Schedule,Nani Shyam Singha Roy Kolkata Schedule,Shyam Singha Roy In Kolkata,Kolkata,Shyam Singha Roy New Schedule In Kolkata,Shyam Singha Roy Film Set In Kolkata,Shyam Singha Roy Begin New Shooting Schedule,Shyam Singha Roy Kolkata Shooting,Shyam Singha Roy Start New Schedule In Kolkata

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న కొత్త‌గా మేకోవ‌ర్ అయ్యారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు ఈ సినిమా తాజా షెడ్యూల్ కోల్‌క‌తాలో ప్రారంభ‌మైంది. లాంగ్ షెడ్యూల్ లో సాగే ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లతో స‌హా ప్ర‌ధాన తారాగ‌ణం అంతా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ప‌లు కీల‌క స‌న్నివేశాలు ఇక్కడ చిత్రీక‌రించ‌నున్నారట.

కాగా నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌‌డోన్నా సెబాస్టియ‌న్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

దీనితో పాటు శివనిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్‌ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుండగా.. . థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 11 =