దిల్ రాజు ‘షాదీ ముబారక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Dil Raju Confirms Release Date For His Movie Shaadi Mubarak,Dil Raju,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Actor Sagar,Sagar,Hero Sagar,Shaadi Mubarak,Shaadi Mubarak Movie,Shaadi Mubarak Telugu Movie,Actor Sagar Shaadi Mubarak,Dil Raju Shaadi Mubarak,Shaadi Mubarak Release Date,Shaadi Mubarak Movie Release Date,Shaadi Mubarak Release Date Announced,Shaadi Mubarak Release Date Confirmed,Shaadi Mubarak Release Date Out,Shaadi Mubarak on March 5th,Shaadi Mubarak From Mar 5th,Shaadi Mubarak March 5th Release,Shaadi Mubarak Release Date Update,Dil Raju Shaadi Mubarak Release Date Fix,Dil Raju Shaadi Mubarak Release Date

ఆర్కే నాయుడు.. కాస్త సీరియల్స్ చూసే అలవాటు ఉన్నవారికి వెంటనే ‘మొగలిరేకులు’ సీరియల్‌ గుర్తుకొస్తుంది. ఈ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రలో సాగర్‌ నటించిన సంగతి తెలిసిందే. సాగర్ కంటే ఆర్కే నాయుడుపేరే ఫిక్స్ అయిపోయింది తనకి. ఆ సీరియల్ సాగర్ కు తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక హీరోకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో దాదాపు ఈ పాత్ర ద్వారా సాగర్ కు కూడా అలాంటి క్రేజే దక్కింది. ఇక ఆ గుర్తింపుతో అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటించాడు.. అంతేకాదు ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది అనుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరో సినిమాతో వస్తున్నాడు. పద్మశ్రీ దర్శకత్వంలో ప్రస్తుతం ‘షాదీ ముబారక్’ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.