‘రాధే శ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్ కు టైం ఫిక్స్

Radhe Shyam Movie Team To Unveil First Glimpse On Valentines Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Prabhas,Rebel Star Prabhas,Actor Prabhas,Prabhas Radhe Shyam,Radhe Shyam New Poster,Radhe Shyam Pre Teaser Time Announced,Prabhas Radhe Shyam Latest Poster,Glimpse Of Radhe Shyam On 14th Feb,Glimpse Of Radhe Shyam,Pooja Hegde,Actress Pooja Hegde,Radhe Shyam Glimpse,First Glimpse Of Radhe Shyam,Radhe Shyam First Glimpse,Radhe Shyam First Glimpse On Valentines Day,Radhe Shyam On Valentines Day,Radhe Shyam First Glimpse News,Prabhas Radhe Shyam New Poster

ప్రభాస్, పూజా హెగ్డేల ప్రేమ కావ్యానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా వస్తున్నసంగతి తెలిసిందే. విక్ర‌మాదిత్య పాత్ర‌లో ప్రభాస్ నటిస్తుండగా.. పూజా హెగ్డే .. ప్రేర‌ణ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తాజాగా టైం కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 14 ఉద‌యం 9.18 ని.ల‌కు సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలియచేస్తూ ప్రభాస్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రీ టీజర్ లో తన లుక్ తో అదరగొట్టిన ఈ పోస్టర్ లో తన క్లాస్ లుక్ తో మరోసారి ఆకట్టుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రాధా కృష్ణ దర్శకత్వంలో 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనుండగా… రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాలను కూడా చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుండగా… మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నాడు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో పాన్ ఇండియా సినిమాను.. ఇక ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్’గా చేస్తోంది.ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =