వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న సినిమా ‘లైగర్’. మొన్నీమధ్య ఈ సినిమా టైటిల్ ను ప్రకటించడం తప్పా.. పెద్దగా అప్ డేట్స్ ఏమీ ఇచ్చింది లేదు. ఇక చాలా కాలం నుండి మంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న రౌడీ హీరో ఫ్యాన్స్ కు ఉదయాన్నే మంచి వార్త చెప్పారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకోగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామని చెప్పినసంగతి తెలిసిందే కదా.. ఇక చెప్పినట్టే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Date is set.
India – we are coming!
September 9, 2021. #LIGER#SaalaCrossbreed#PuriJagannadh @ananyapandayy @karanjohar @charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/pgclqQYiQ4— Vijay Deverakonda (@TheDeverakonda) February 11, 2021
కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
మరి పూరి జగన్నాథ్ కూడా ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకూ ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో.. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో… పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: