‘రాధే శ్యామ్’ – సౌత్, నార్త్ మ్యూజిక్ డైరెక్టర్స్ కన్ఫామ్

Radhe Shyam Movie Team Welcomes These Two Renowned Music Directors On Board,Prabhas Starrer Radhe Shyam,Justin Prabhakaran Music Composer Of Radhe Shyam,Mithoon And Manan Bhardwaj As Music Composers For Radhe Shyam,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Radhe Shyam Movie Team Welcomes Two Music Directors,Mithoon,Manan Bhardwaj,Justin Prabhakaran,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Latest News,Prabhas,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Music Directors,Radhe Shyam Movie Team Welcomes Two Music Directors,Pooja Hegde,Radhe Shyam Music Composers

ఈ మధ్య రాధే శ్యామ్ టీమ్ అసలు ఎలాంటి హింట్ లేకుండా అప్ డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఫిబ్రవరి 14 న అప్ డేట్ ఉందంటూ ఊహించని విధంగా అప్ డేట్ ఇస్తూ ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే ఈ చిత్రం టీజర్ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా రాధే శ్యామ్ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా జస్టిన్ ప్రభాకరన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే జస్టిన్ ప్రభాస్ సౌత్ లాంగ్వేజస్ కు మాత్రమే సంగీతం అందించనున్నాడు. అంటే తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రాధే శ్యామ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హిందీకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించారు. రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు.

కాగా రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇంకా ఖరారు. రిలీజ్ డేట్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఈ ప్రేమకావ్యం రిలీజ్ కు ముహూర్తం ఎప్పుడు పెడతారో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − six =