కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 82

సినిమా వార్తలు

'అక్షర' సినిమాతో విద్యను చూసే కోణంలో మార్పు రావాలి

బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న ‘‘అక్షర’’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో . ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఎమ్మెల్సీ కవిత, దర్శకులు సుధీర్ వర్మ, కృష్ణ చైతన్య, శ్రీకాంత్ అడ్డాల తదితరులు ‘‘అక్షర’’ సినిమా ఘన విజయం సాధించాలని టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. బిగ్ టికెట్ ను సాయి తేజ్, ఎమ్మెల్సీ కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే 'చెక్' సినిమా వెంటనే ఓకే చేశా

'ఒరు అదార్ ల‌వ్‌'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమా అంత విజయం కాకపోయినా ప్రియా మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక తెలుగులో చెక్ లాంటి మరో విభిన్నమైన సినిమాతో వచ్చేస్తుంది. ఇది ప్రియా ప్రకాష్ కు డైరెక్ట్ తెలుగు ఫిలిం. మరి ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రియా ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'రంగ్ దే'

ఒక సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. మరో సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. మూడో సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. ఇది నితిన్ సినిమాల అప్ డేట్స్. మొత్తానికి ఈ ఏడాది ఎలా లేదనుకున్నా నితిన్ మూడు సినిమాలతో సందడి చేసేలానే కనిపిస్తున్నాడు. అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. కరోనా కారణంగా కొన్ని నెలలు బ్రేక్ రాగా తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసారు. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' లో సన్నీ సింగ్

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో సినిమా, ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తో సలార్. అన్నీ ఒకదానికి మించి ఒకటి పెద్ద ప్రాజెక్టులే. రాధేశ్యామ్ చేస్తూనే 'కెజిఎఫ్‌' ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌తో 'సలార్‌ సినిమాను ప్రారంభించారు. సలార్ షూటింగ్ కూడా జరుగుతుంది ప్రస్తుతం. మరోవైపు ఆదిపురుష్ సినిమా కూడా మొదలు పెట్టాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుజీత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ - ఈసారి యాక్షన్ ప్లస్ ఎమోషన్

రన్ ‌రాజా రన్ తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్‌ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ తీసి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే మెగాస్టార్‌ లూసిఫర్ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల అది వేరే డైరెక్టర్ చేతికి వెళ్ళింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'తెల్లవారితే గురువారం' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'లైగర్' సెట్ లో 'శివగామి'

విజయ్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం లైగ‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. అంతేకాదు అక్కడికి వెళ్లిన విజయ్ అక్కడ బాలీవుడ్ భామలతో పార్టీలు చేస్తూ బిజీ గా వున్నాడు. తాజాగా `లైగ‌ర్‌` టీమ్ అంతా ప్ర‌త్యేకంగా ఇటీవ‌ల ఓ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో క‌రణ్‌‌ జోహార్, చార్మి, పూరి, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో పాటు బాలీవుడ్ హాట్ బేబ్స్ కియారా అద్వానీ, సారా అలీఖాన్ పాల్గొన్నారు.ఇక ఈ ఫొటోలు సోషల్…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'టక్ జగదీష్' టీజర్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'టక్ జగదీష్'. 'నిన్ను కోరి' సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుండే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్.. మోషన్ పోస్టర్ ఆ అంచనాలను ఇంకా పెంచేసింది. మరోసారి నాని-శివ తమ మ్యాజిక్ ను క్రియేట్ చేసేలా ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడింది. క్లాస్ లుక్ లో మాస్ యాంగిల్ నాని యాక్షన్ సినిమాకు పెద్ద హైలైట్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ అయ్యాయి కూడా.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మోసగాళ్ళు' ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Sri Simha Koduri New Movie Title Announced Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Sri Simha Koduri,Bhaag Saale Movie,Bhaag Saale Movie Sri Simha,Sri Simha Keeravani Son,Sri Simha Koduri,Sri Simh
సినిమా వార్తలు

కీరవాణి తనయుడు శ్రీ సింహా 'భాగ్ సాలే'

మొదటి సినిమా 'మత్తు వదలరా' లాంటి భిన్నమైన సినిమాను తీసి విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కరణం మల్లీశ్వరీ' ఆగిపోలేదు- కోన క్లారిటీ

తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రాజుగాడు’తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకురాలు సంజనా రెడ్డి దర్శకత్వంలో ఈ బయోపిక్ రూపొందుతుంది. ఎప్పుడో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న సాయి తేజ్ 'రిపబ్లిక్'

కొంతకాలం ప్లాప్స్ తో సతమతమైన సాయి తేజ్ ఆ తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల హిట్స్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ద‌ర్శకుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శక‌త్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఉప్పెన' ఒక క్లాసిక్

విడుదలై వారం రోజులు అవుతున్నా ఇంకా 'ఉప్పెన' సినిమా గురించే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయకుండా పట్టుబట్టి థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ ఆగి.. థియేటర్స్ లోనే ఎందుకు రిలీజ్ చేశారో.. ఈ సినిమాపై అంత నమ్మకంగా ఎలా వున్నారో.. దానికి ఈ సినిమా ఇచ్చిన సక్సెసే నిలువెత్తు నిదర్శనం. ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అవుతుంది ఇంకా పలు ప్రాంతాల్లో మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది. అంతేకాదు ఎంతోమంది సినీప్రముఖుల ప్రసంశలు అందుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డీఎస్పీ, కృతి శెట్టి కి 'మెగా సర్ ప్రైజ్'

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత సంచలనమైన హిట్ కొట్టిందో చూస్తున్నాం. వైష్ణవ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, సాయి చంద్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 12 న రిలీజ్ అయి ఉప్పెనలా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. డెబ్యూ హీరోగా కలెక్షన్స్ పరంగా వైష్ణవ్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విజయంలో వైష్ణవ్, విజయ్ సేతుపతి పాత్ర ఎంత వుందో హీరోయిన్ కృతి శెట్టి, దేవి శ్రీ ప్రసాద్ పాత్ర కూడా అంతే ఉందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి వారికి మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'విరాట పర్వం' - ఫస్ట్ సింగిల్ కు టైం ఫిక్స్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి ప‌ర్వ‌దినాన రిలీజ్ చేసిన రానా-సాయిప‌ల్ల‌వి జంట పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ 'ఆదిపురుష్' వల్ల నాకు అదే లాభం

బాహుబలి సిరీస్, సాహూ సినిమాలకు చాలా టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం అస్సలు గ్యాప్ లేకుండా షూటింగ్ లు చేసేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఒక సినిమా మినహాయించి మూడు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లలో పాల్గొంటున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్' ఎలాగూ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లోనూ.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అది పురుష్' షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

మారిన 'A1 ఎక్స్ ప్రెస్' రిలీజ్ డేట్

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేయాలనుకున్నారు.. ఆ మేరకు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. అయితే ఇంకా పనులు ఉండటంతో రిలీజ్ డేట్ ను మారుస్తూ మరోసారి ప్రకటించారు. మార్చి 5వ తేదీన రిలీజ్ అవుతున్నట్టు ప్రకటిస్తూ చిత్ర బృందం ఒక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. అంతేకాదు సందీప్ కిషన్ కూడా తన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈవారం సందడి చేయనున్న సినిమాలు

ఈ ఫిబ్రవరి నెల సినిమాల సందడితోనే ముగిసిపోనుంది. నిజానికి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ లు పెద్దగా పెట్టుకొనేవారు కాదు దర్శకనిర్మాతలు. వస్తే వాలెంటైన్స్ డే కి ఒకటో రెండో సినిమాలు వచ్చేవి. సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత సమ్మర్లో సినిమాల సందడి మొదలవుతుంది. కానీ గత ఏడాది కరోనా వల్ల థియేటర్స్ లేకపోవడంతో ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. ఇక థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో వీలైనంత త్వరగా రిలీజ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి రిలీజ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం వరుస రిలీజ్ లతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడిగా మారింది.

TFN Adminవాట్సాప్
సాంగ్

దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సర్కారు వారి పాట'

గత ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. కరోనా వల్ల ఈ ఏడాది మాత్రం స్కిప్ చేసినట్టే. కరోనా వల్ల గత ఏడాది షూటింగ్ లు కూడా లేకపోవడంతో ఈ ఏడాది రావాల్సిన సినిమా వచ్చే ఏడాదికి వెళ్ళింది. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 27వ సినిమాగా రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. 'గీత గోవిందం' సినిమా తర్వాత పరుశురాం చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక గత కొద్దికాలంగా ఈ సినిమా దుబాయ్ లో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే కదా. సినిమాకు చాలా కీలకమైన ఎపిసోడ్స్ కొన్ని ఇక్కడే చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తేజ 'చిత్రం' సీక్వెల్ 'చిత్రం 1.1'

టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇక వారిలో కాస్త డిఫరెంట్ గా వుండే డైరెక్టర్స్ కొంతమంది వుంటారు. వారిలో తేజ లాంటి వారిది కాస్త విభిన్నం. మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. ఎప్పుడూ కొత్త వాళ్లకి ఛాన్స్ లు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు. తన మొదటి సినిమా 'చిత్రం' లోనే దాదాపు అందర్నీ కొత్తవారిని పెట్టి సినిమా తీసి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో చాలా మంది సినీ కెరీర్ కు ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గత ఏడాదికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత…

TFN Adminవాట్సాప్

షేర్