అందుకే  ‘చెక్’ సినిమా వెంటనే ఓకే చేశా

Priya Prakash Varrier Makes An Interesting Revelation About Check Movie In A Recent Interview,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Actress Priya Prakash Varrier,Priya Prakash Varrier,Check,Check Movie,Check Film,Check Telugu Movie,Check Movie Telugu,Check Update,Check Movie Latest News,Check Movie Latest Updates,Actress Priya Prakash Varrier About Check Movie,Priya Prakash Varrier Exclusive Interview,Nithiin,Nithiin Check,Priya Prakash Varrier Latest News,Priya Prakash Varrier New Movie,Priya Prakash Varrier Check Movie Details,Priya Prakash About Check,Priya Prakash Varrier Interesting Revelation About Check,Priya Prakash Varrier Recent Interview,Priya Prakash Varrier Interview,Priya Prakash Varrier Latest Interview,Priya Prakash Varrier About Nithiin,Actress Priya Prakash Varrier Latest Interview

‘ఒరు అదార్ ల‌వ్‌’లో ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమా అంత విజయం కాకపోయినా ప్రియా మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక తెలుగులో చెక్ లాంటి మరో విభిన్నమైన సినిమాతో వచ్చేస్తుంది. ఇది ప్రియా ప్రకాష్ కు డైరెక్ట్ తెలుగు ఫిలిం. మరి ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రియా ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఫోన్ చేసి అడిగిన వెంటనే ఓకే చెప్పేశారట. కథ కూడా వినకుండా…

అవును. నేను నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ‘చెక్’. వింక్ మూమెంట్ తర్వాత తెలుగు నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. అయితే, మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘చెక్’ వచ్చింది. మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఆయన దర్శకత్వం వహించిన ‘మనమంతా’ చూశా. తెలుగు కాదు… మలయాళంలో. అక్కడ ‘విస్మయం’ పేరుతో విడుదలైంది. అందులో నా అభిమాన హీరో మోహన్ లాల్ నటించడంతో మిస్ కాలేదు. ఆ సినిమా చూసినప్పుడు చందూ సార్ ఎంత గొప్ప డైరెక్టర్ అనేది అర్థమైంది. ఆయన ఫోన్ చేసి ‘చెక్’లో నువ్వు నటించాలని అడిగారు. సీనియర్, బ్రిలియంట్ డైరెక్టర్ అడిగారు…  పైగా నితిన్, రకుల్ చేస్తున్నారని చెప్పారు. మంచి స్టార్ కాస్ట్, మంచి ప్రొడక్షన్ హౌస్ కనుక హ్యాపీగా ఓకే చేశా.

ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది.. నా పాత్ర గురించి ఎక్కువ చెప్పలేను. కానీ, ఆదిత్య ప్రేయసి యాత్ర పాత్రలో నటిస్తున్నాని చెప్పగలను. ఆదిత్యగా నితిన్ నటించారు. ఆదిత్య ప్రయాణమే ‘చెక్’. ఆ ప్రయాణంలో యాత్ర ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది.

నితిన్ తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

నితిన్ ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చారు.. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశారు. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో ముందు కొంచం టెన్షన్ పడ్డాను. అయితే, సెట్ లో అందరూ నేను కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకున్నారు. నితిన్ సీనియర్, నేను న్యూకమర్ వంటి తేడాలు చూపించలేదు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సమానంగా చూశారు. అందుకు నితిన్ కూడా కారణం.

నిర్మాత ఆనందప్రసాద్ గారి గురించి?

ఒకరకంగా నేను ఈ సినిమాలో ఉండటానికి ఆయన కూడా ఒక కారణం. యాత్ర పాత్రలో చందూ సార్ నన్ను ఓకే చేసినా.. ఒకవేళ నిర్మాత ఆ పాత్రకు నన్ను వద్దని అంటే ఇంకో హీరోయిన్ ను పెట్టుకోవాల్సిందే. కానీ చందూ సార్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను. వెరీ సపోర్టివ్… నాపై నిర్మాత ఆనందప్రసాద్ గారు నమ్మకం ఉంచారు.

చంద్రశేఖర్ యేలేటి మీరు బాగా నటించారని చెప్పారు. సెట్స్ లో మీ యాక్టింగ్ చూసి ఏమన్నారు?

నిజానికి ఇది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్.. నేను బాగా నటించానని ఆయన చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే.. చందూ సార్ ఎక్స్‌ప్రెషన్స్ అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. న్యూట్రల్‌గా ఉంటాయి. ఆయన సంతోషంగా ఉన్నారో, బాధలో ఉన్నారో చెప్పడం కష్టం. మనం ఊహించలేం. షూటింగ్ చేసేటప్పుడు షాట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన వైపు చూసేదాన్ని. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. ‘సార్… నేను బాగా చేశానా? ఓకేనా?’ అని అడిగితే… ‘యా యా ఓకే’ అనేవారు. అద్భుతంగా నటించినా, సరిగా చేయకపోయినా ఆయన ఒకేలా ఉంటారు.

సెట్స్ లో మీరు పాటలు కూడా పాడేవారని చెప్పారు.

నాకు మామూలుగానే పాటలు పాడటం అలవాటు. సెట్స్ లో ఫ్రీ టైమ్ దొరికితే నాకు ఏదో ఒక పాట హమ్మింగ్ చేస్తా. నేను పాడుతుంటే చందూ సార్ ఎంజాయ్ చేసేవారు. అందుకే ‘చెక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘నువ్వు మాట్లాడతావా? పాట పాడతావా?’ అని అడిగారు.

తెలుగులో మీకిది తొలి సినిమా. షూటింగులో ప్రాంప్టింగ్ లేకుండా డైలాగులు చెప్పారట. ముందే ప్రాక్టీస్ చేశారా?

ప్రాంప్టింగ్ ఐడియా నాకు నచ్చదు. ఎవరో ప్రాంప్టింగ్ చెబుతుంటే యాక్టింగ్ మీద కాన్సంట్రేట్ చేయలేను. అందుకే షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెండు రోజుల ముందు చందూ సార్, కో డైరెక్టర్లతో కొన్ని రీడింగ్ సెషన్స్ లో పాల్గొన్నా. ప్రతి డైలాగ్ చదివాను. దాని మీనింగ్ ఏంటో అడిగి తెలుసుకున్నాను. నేను ఏం చెబుతున్నానో నాకు పూర్తిగా తెలిస్తే… భావోద్వేగాలను బాగా పలికించగలను. సెట్స్ లో కూడా డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ సీన్ లో డైలాగులు ప్రాక్టీస్ చేశా.

రెండు రోజుల్లో డైలాగులు నేర్చుకున్నారంటే మీరు ఇంటిలిజెంటే!

(నవ్వుతూ) కొన్నిసార్లు డైలాగులు చదివిన తర్వాత వచ్చేస్తాయి. ఇప్పుడు నాతో ఎవరైనా తెలుగులో మాట్లాడితే… వాళ్లు ఏం చెబుతున్నారో అర్థం అవుతుంది. కొంచెం కొంచెం మాట్లాడగలను. తెలుగులో ఇంకొన్ని సినిమాలు చేస్తే పూర్తిగా తెలుగులో మాట్లాడతాను.

మాట్లాడటమే కాదు… తెలుగులో పాటలు కూడా పాడుతున్నారు కదా!

ప్రయివేట్ సాంగ్ ‘లడీ లడీ’ పాడాను. అవకాశం వస్తే నా సినిమాల్లోనూ పాడాలని అనుకుంటున్నా. ‘చెక్’లో ఒకే ఒక పాట ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ ఉంది. ముందు దానికి నాతో పాడించాలని అనుకున్నారు. ఎందుకంటే…  మేం షూటింగ్ చేసేటప్పుడు సెట్స్ లో నేను పాటలు హమ్ చేస్తూ ఉండేదాన్ని. అది చందూ సార్ గమనించారు. సాంగ్ ట్రాక్ పంపించారు. కానీ, కుదరలేదు. ఇక నుంచి కుదిరితే నా పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో పాటు అవకాశం వస్తే పాటలు కూడా పాడాలని అనుకుంటున్నాను.

తెలుగులో మీకు చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళ గురించి?

తెలుగు ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం నెక్స్ట్ లెవెల్. ‘చెక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ క్రౌడ్ అయితే క్రేజీ. క్రౌడ్ నుంచి బయటపడతానని అనుకోలేదు. స్టేజ్ దిగిన తర్వాత అభిమానులు చుట్టుముట్టారు. ‘ఇక్కడ స్టక్ అయిపోయా’ అనుకున్నాను. స్టేజ్ నుంచి హాలు వరకు రావడానికి కొంత సమయం పట్టింది. ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం బ్లెస్సింగ్. ‘లవర్స్ డే’ తర్వాత రెండేళ్లుగా నేను ఏమీ చేయలేదు. ‘చెక్’ వంటి మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూశా. రెండేళ్ల నుంచి నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ఇటువంటి సంఘటన ఏదో ఒకటి జరుగుతుంది.

ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాలు?

తెలుగులో ‘ఇష్క్’ చేస్తున్నా. కన్నడలో ‘విష్ణుప్రియ’ చేశా. అందులో ఓ పాట కూడా పాడాను. హిందీలో ‘శ్రీదేవి బంగ్లా’తో పాటు మరో సినిమాలో నటించా.

ఫైనల్ గా… ‘చెక్’ సినిమా చూశారా?

ఇంకా చూడలేదు.. నిజానికి హైదరాబాద్ లో ఫ్యామిలీతో కలిసి చూడాలని అనుకున్నాను కానీ అదే రోజు మా తమ్ముడికి ఎగ్జామ్ ఉంది. అందువల్ల, ఫ్యామిలీ హైదరాబాద్ రావడం కుదరడం లేదు. కొచ్చిలో కూడా ‘చెక్’ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి అక్కడ షోకి వెళ్లే ప్లాన్ చేయాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =