‘విరాట పర్వం’ – ఫస్ట్ సింగిల్ కు టైం ఫిక్స్

First Song of Rana’s Viraata Parvam Releasing Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Viraata Parvam First Single Kolu Kolu To Be Out On 25th Feb,Rana Viraata Parvam,Viraata Parvam,Viraata Parvam Movie,Viraata Parvam Telugu Movie,Viraata Parvam Movie Update,Viraata Parvam First Song News,Viraata Parvam First Song,First Song of Rana’s Viraata Parvam,First Song of Viraata Parvam,Viraata Parvam First Single,Kolu Kolu,Kolu Kolu Song,Kolu Kolu Lyrical Video On 25th Feb,Viraata Parvam Kolu Kolu Lyrical Video,Viraata Parvam Kolu Kolu First Single,Viraata Parvam Movie Kolu Kolu Song,Viraata Parvam Song,Viraata Parvam Movie Songs,Rana Daggubati,Sai Pallavi,Actress Sai Pallavi,Actor Rana Daggubati,#ViraataParvam

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి ప‌ర్వ‌దినాన రిలీజ్ చేసిన రానా-సాయిప‌ల్ల‌వి జంట పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న ‘విరాట‌ప‌ర్వం’ను ఏప్రిల్ 30న విడుద‌ల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమానుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఫిబ్ర‌వ‌రి 25న కొలు కొలు అనే లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సందర్భంగా సాయిప‌ల్ల‌వికి చెందిన ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. అందులో సాయి పల్లవిని చూసిన అందరూ ఫిదా అవుతున్నారు. కలర్ ఫుల్ లంగావోణిలో సాయి పల్లవి డ్యాన్స్ చేస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటుంది.

కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.