తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో కరణం మల్లీశ్వరి బయోపిక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రాజుగాడు’తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకురాలు సంజనా రెడ్డి దర్శకత్వంలో ఈ బయోపిక్ రూపొందుతుంది. ఎప్పుడో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.
అయితే కరోనా వల్ల సినిమాకు బ్రేక్ పడింది. అంతేకాదు ఆ తర్వాత నుండి ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ కూడా లేకపోవడంతో సినిమా ఆగిపోయిందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఈ వార్తలపై కోన వెంకట్ స్పందిస్తూ లెజెండ్రీ స్పోర్ట్స్ ఉమెన్ కరణం మల్లీశ్వరీ బయోపిక్ ను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాం.. ఇలాంటి సినిమాను తెరకెక్కించాలంటే కాస్త టైం పడుతుంది.. ప్రస్తుతం వర్క్ జరుగుతూనే ఉంది.. ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు.
“Karanam Malliswari” is a Pan Indian movie of a legendary sports woman @kmmalleswari .. It takes time to create a master piece.. All works are in progress .. The biopic is going to inspire this generation 👍 @sanjanareddyd @MVVCinema_ @KonaFilmCorp https://t.co/FGVJGt2rOE
— kona venkat (@konavenkat99) February 23, 2021
ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్ట్ విభాగంలో భారత్‌కు తొలి పతకం సాధించిన తొలి భారతీయ మహిళ. ప్రముఖ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న, పద్మశ్రీని అందుకున్నారు. ఓ మారుమూల పల్లె నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం గెలిచే వరకు ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది అన్న విషయాలు బయోపిక్‌లో చూపించనున్నారు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.