‘ఆదిపురుష్’ లో సన్నీ సింగ్

Bollywood Actor Sunny Singh To Play The Pivotal Role In Prabhas Adipurush Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Bollywood Actor Sunny Singh,Actor Sunny Singh,Sunny Singh Joins Prabhas's Adipurush,Prabhas,Rebel Star Prabhas,Adipurush,Adipurush Movie,Adipurush Film,Adipurush Telugu Movie,Adipurush Movie News,Adipurush Update,Adipurush Latest Updates,Sunny Singh Joins The Cast Of Prabhas Adipurush,Actor Sunny Singh In Prabhas Adipurush,Sunny Singh Receives A Warm Welcome From Director Om Raut,Sunny Singh Kickstarts Shoot For Adipurush,Sunny Singh Officially Joins Prabhas Adipurush,Director Om Raut Welcomes Sunny Singh,Director Om Raut,Sunny Singh Joins Prabhas Upcoming Film Adipurush,Sunny Singh Joins The Sets Of Adipurush,Sunny Singh To Play The Pivotal Role In Adipurush

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో సినిమా, ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తో సలార్. అన్నీ ఒకదానికి మించి ఒకటి పెద్ద ప్రాజెక్టులే. రాధేశ్యామ్ చేస్తూనే ‘కెజిఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్‌ సినిమాను ప్రారంభించారు. సలార్ షూటింగ్ కూడా జరుగుతుంది ప్రస్తుతం. మరోవైపు ఆదిపురుష్ సినిమా కూడా మొదలు పెట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో హీరో కూడా ఫిక్స్ అయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు. ‘సోను కే టీటూ కీ స్వీటీ’ చిత్రంతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న సన్నీ సింగ్. సన్నీ సింగ్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అంతేకాదు లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సీతగా ఎవరు కనిపించనున్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. అయితే కృతి సనన్ సీత పాత్రలో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగ‌స్ట్ 11,2022న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు  ఇప్పటికే ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.