
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 81

మార్చి నుండి వెంకీ 'దృశ్యం2'

అక్షర మూవీ పబ్లిక్ టాక్
సామ్@11 - శాకుంతలం టీమ్ విషెస్
'షాదీ ముబారక్' ట్రైలర్ రిలీజ్
అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు
పవన్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి'
'చెక్' ఇంట్రెస్టింగ్ పాయింట్స్
నితిన్ 'ఇష్క్' కు 9ఏళ్లు
'తలైవి' రిలీజ్ డేట్ ఫిక్స్
'ఖిలాడి' నైట్ షూట్
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ సెట్
షూటింగ్ పూర్తిచేసుకున్న 'డియర్ మేఘ'
'రామ్19' లో కృతి శెట్టి..!

'ఆదిపురుష్'-అంత ఈజీ కాదు

చెక్ మూవీ పబ్లిక్ టాక్
@BhavyaCreations ThaNk You SoMuCh FoR GiViNg SuCh A WoNdeRFuL MoVie To My Bro @actor_nithiin !!😍 @Rakulpreet @yeletics #saichand GaRu #PriyaPrakashVarrier…
మార్చి నుండి వెంకీ 'దృశ్యం2'
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది.

అక్షర మూవీ పబ్లిక్ టాక్
Positive Vibes All Over!! @Nanditasweta !! Kudos to the Entire Team!! ♥️ @ahiteja @sureshvarmaz #Akshara #blockbusterakshara 🤩🤩❤️❤️😍😍 Another Blockbuster…
ఓటీటీ లకు సెన్సార్
టెక్నాలజీ పుణ్యమా అని చేతిలో ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతిలో వున్నట్టు అయిపోయింది ఇప్పుడు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో అవగాహన కూడానే బాగానే పెరుగుతుంది. దానితో సినిమా పరిస్థితి కూడా అలానే అయిపోయింది. ఒకప్పుడు థియేటర్ లో సినిమా చూడాలంటే అదొక థ్రిల్లింగ్ లా ఫీలయ్యేవారు అందరూ. కానీ ఇప్పుడు థియేటర్ లో చూడకపోయినా పర్వాలేదు ఎలాగూ ఆన్ లైన్ లో వస్తాయి కదా అన్న ధోరణి పెరిగిపోయింది.
సామ్@11 - శాకుంతలం టీమ్ విషెస్
ఏం మాయ చేసావే సినిమా.. ఈ సినిమాలో తన నటనతో మాయ చేసిన సమంతను ఎవరు మరిచిపోతారు. జెస్సీ పాత్రలో తను నటించింది అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పొచ్చు. తన మాటలు, హావభావాలు, అందం, అభినయం ఇలా అన్నీ కలబోసి కుర్రకారు మదిని దోచింది సమంత. ఆ సినిమాతో మొదలైన సమంత సినీ కెరీర్ ఇప్పటివరకూ సక్సెస్ ఫుల్ గానే కొనసాగింది.
'షాదీ ముబారక్' ట్రైలర్ రిలీజ్
ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు.. తాజాగా షాదీ ముబారక్ అంటూ ఒక చిన్న సినిమాతో వస్తున్నాడు. పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్ప్పుడు వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా గంగూబాయికతియావాడీ. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా అందులో అలియా నటన చూసినవారందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
'మోసగాళ్ళు' ట్రైలర్ రిలీజ్ - సిస్టమ్‌ని ఆట ఆడించేవాడే కింగ్
గతకొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. దీనిలో భాగంగానే ఇప్పుడు మోసగాళ్ళు అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఈసినిమాలో కాజల్ అగర్వాల్ మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం…
పవన్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి'
ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి' పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం వరకు దగ్గర దగ్గరగా వంద చిత్రాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక కొంత కాలం విరామం తరువాత ఆయన మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
'చెక్' ఇంట్రెస్టింగ్ పాయింట్స్
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈసారి నితిన్ పూర్తి ఎక్స్ పెరిమెంటల్ మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లలో ఆ విషయం అర్ధమైంది. ఈసినిమా కూడా నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అర్థమవుతుంది. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలో.. ఈ సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎంటో ఒకసారి చూద్దాం.
నితిన్ 'ఇష్క్' కు 9ఏళ్లు
ఏన్నో సినిమాల ఫ్లాప్స్ తర్వాత నితిన్ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా ఇష్క్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నితిన్-నిత్యా మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంది. లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకుల మనసును తాకింది. ఈ సినిమాకు మరో హైలైట్ మ్యూజిక్. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం శ్రోతల్ని అలరించింది. దీనితోపాటు ఈ మూవీకి పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ , డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.
'తలైవి' రిలీజ్ డేట్ ఫిక్స్
కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఆ అవకాశం వస్తే నా ఫస్ట్ ఛాయిస్ పవన్‌కల్యాణ్‌గారే
చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా చెక్. ఇక ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 26)న రీలీజ్ కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో అంచనాలను పెంచగా ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో.. లేదో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న నితిన్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు. అవేంటో మీరు కూడా ఒక లుక్కేయండి.
'ఖిలాడి' నైట్ షూట్
రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్స్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు మరోసారి మరో ఎనర్జిటిక్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పలు లొకేషన్స్ లో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ షూటింగ్ కు సంబంధించి ఒక చిన్న వీడియో ను తన ఇన్స్టాలో పోస్ట్ చేసాడు రవితేజ్. దానికి నైట్ షూట్ అని కూడా క్యాప్షన్ ఇచ్చాడు.
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ సెట్
క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్ మలినేని. ఇక క్రాక్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తన తర్వాత సినిమా బాలకృష్ణ తో సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కారణం బాలయ్యతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో గోపీచంద్ పోస్ట్ చేయడమే.
'శ్యామ్ సింగరాయ్' ఫస్ట్ లుక్ రిలీజ్
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ టైటిల్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. దానికితోడు ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.నాని పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే టక్ జగదీష్ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు 'శ్యామ్ సింగరాయ్' నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నాడు అని చిత్రయూనిట్ చెప్పినట్టే ఉంది ఫస్ట్ లుక్ ను చూస్తుంటే. ఈ సినిమా కోసం నాని కొత్తగా…
పవన్-క్రిష్ సినిమా ఫస్ట్ లుక్,టైటిల్ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఇప్పటి వరకూ పవన్ సినిమాల్లో వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్ డేట్స్ మాత్రమే వచ్చాయి. కానీ మరే సినిమా షూటింగ్ కు సంబంధించి పెద్దగా అప్ డేట్స్ రాలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్-క్రిష్ సినిమా అప్ డేట్ వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు సంబంధించి తాజాగా అప్ డేట్ ఇచ్చారు. మార్చి 11న ఈ సినిమా ఫస్ట్…
షూటింగ్ పూర్తిచేసుకున్న 'డియర్ మేఘ'
మేఘ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'డియర్ మేఘ'. ఇటీవలే ఈ సినిమానుండి మేఘ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేఘ ఈసారి విభిన్నమైన పాత్రతో వస్తుందని అర్థమైంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీ గా ఉన్న చిత్రయూనిట్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాదు కేవలం 28 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమాను త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
'రామ్19' లో కృతి శెట్టి..!
ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే కృతి శెట్టికి వరుస అవకాశాలు తలుపుతట్టాయి. మరి సినిమా రిలీజ్ అయి.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్కొట్టి.. అందులోనూ నటనలో వందకు వంద మార్కులు పడితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు కృతి శెట్టి పరిస్థితి కూడా అదే. ఉప్పెన ఘన విజయంతో ఈ భామకు అవకాశాలు కూడా ఉప్పెనలా వస్తున్నాయి. ఇప్పటికే నాని సరసన ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్న ఈ భామ, సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా కథానాయికగా ఖరారైంది. ఇప్పుడు మరో సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

'ఆదిపురుష్'-అంత ఈజీ కాదు
మాములుగా ఒక సినిమా తీయాలంటేనే ఎంతో కష్టంతో కూడుకున్న పని.. ఒకవేళ తీసినా అది ఆడియన్స్ కు నచ్చుతుందో..లేదో అన్నది దర్శక నిర్మాతలకు పెద్ద టెన్షన్.. అలాంటిది పురాణాల ఆధారంగా తీసే సినిమాలకు ఇంకెంత టెన్షన్ ఉంటుంది. రామాయణం నేపథ్యంలో కాబట్టి కొంచం తేడా జరిగినా రచ్చ చేయడానికి వెయిట్ చేస్తుంటారు చాలా మంది. దీపికా పదుకొనె చేసిన పద్మావతి సినిమా విషయంలో ఎన్ని గొడవలు జరిగాయో చూశాం. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కూడా అదే చెపుతున్నాడు. 'ఆదిపురుష్' సినిమా తీయడం అంత ఈజీ కాదని. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైథలాజికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. మరి ఇలాంటి సినిమాను తీయాలంటే ఎన్నో…