కొంతకాలం ప్లాప్స్ తో సతమతమైన సాయి తేజ్ ఆ తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల హిట్స్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకునట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని దేవకట్ట స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. రిపబ్లిక్ షూటింగ్ పూర్తయింది.. మొత్తం 64 రోజుల్లో షూటింగ్ జరుపుకున్నాం.. ఎలాంటి కోవిడ్ కేసులు లేకుండా షూటింగ్ విజయవంతంగా జరుపుకున్నాం.. దానికి కారణం చిత్ర యూనిట్ అంటూ ఫొటో పోస్ట్ చేసాడు.
It’s a wrap for #REPUBLIC shoot: 64 days in total, fortunately with zero COVID cases!! All made possible by this Army!! Thank you!🙏#RepublicOnJune4th@IamSaiDharamTej @aishu_dil @IamJagguBhai @meramyakrishnan@JBEnt_Offl@cinemainmygenes@bkrsatish@JBhagavan1#ManiSharma pic.twitter.com/RX5jG4fejC
— dev katta (@devakatta) February 23, 2021
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.