టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇక వారిలో కాస్త డిఫరెంట్ గా వుండే డైరెక్టర్స్ కొంతమంది వుంటారు. వారిలో తేజ లాంటి వారిది కాస్త విభిన్నం. మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. ఎప్పుడూ కొత్త వాళ్లకి ఛాన్స్ లు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు. తన మొదటి సినిమా ‘చిత్రం’ లోనే దాదాపు అందర్నీ కొత్తవారిని పెట్టి సినిమా తీసి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో చాలా మంది సినీ కెరీర్ కు ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గత ఏడాదికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత వరుసగా ‘నువ్వు నేను’, ‘జయం’ ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘సీత’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆ మధ్య రెండు సినిమాలను ప్రకటించాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఈ రెండు సినిమాలను అధికారికంగా ఎప్పుడో ప్రకటించాడు. ‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు. అయితే ఇంతవరకూ ఈ సినిమాల గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.
ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమాను ప్రకటించాడు తేజ. అది మరేదో కాదు ‘చిత్రం’ సీక్వెల్ ‘చిత్రం 1.1’. తాజాగా చిత్రం సినిమా సీక్వెల్‌ను తన బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేశాడు తేజ. ఇక చిత్రం సినిమాకు సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్ ఇప్పుడు సీక్వెల్‌కు కూడా సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే నటీ నటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాను ఇప్పుడు ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: