ఒక సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. మరో సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. మూడో సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. ఇది నితిన్ సినిమాల అప్ డేట్స్. మొత్తానికి ఈ ఏడాది ఎలా లేదనుకున్నా నితిన్ మూడు సినిమాలతో సందడి చేసేలానే కనిపిస్తున్నాడు. అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. కరోనా కారణంగా కొన్ని నెలలు బ్రేక్ రాగా తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసారు. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. నితిన్ ఈ విషయాన్ని తెలియజేస్తూ కీర్తి, వెంకీ, వెన్నెల కిశోర్, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తో కలిసి చేసిన ఫన్ వీడియోను ట్విటర్ లో షేర్ చేశాడు.
And RANG DE shoot is DONE!! Will this AMAZING team a lot..
#RANGDEonMARCH26th
@pcsreeram @KeerthyOfficial @dirvenky_atluri @vamsi84 @SitharaEnts pic.twitter.com/xorMvUZtuz— nithiin (@actor_nithiin) February 23, 2021
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
మరోవైపు నితిన్-చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో వస్తున్న చెక్ ఫిబ్రవరి 26న థియేటర్లలో సందడి చేయనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.




Download the My Mango App for more amazing videos from the Tollywood industry.