కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 83

సినిమా వార్తలు

'టక్ జగదీష్' కు థమన్ ఫిదా

టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది హీరోల్లో అసలు ఏమాత్రం బ్రేక్ లేకుండా ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ వెళ్లే హీరో ఎవరైనా వున్నారంటే అందులో న్యాచురల్ స్టార్ నాని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. గత ఏడాది 'వి' సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని ఈ ఏడాది మరో రెండు సినిమాలతో వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రవితేజ 68' అఫీషియల్ అనౌన్స్ మెంట్

మాస్ మహారాజా రవితేజ స్పీడు పెంచాడు. క్రాక్ సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చి.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రవితేజ రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి మంచి ఎనర్జిటిక్ పాత్రలో రవితేజ ఫ్యాన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను స్టూడియోస్‌…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తల్లిదండ్రులకు చరణ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి నేడు 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న వివాహమాడారు. వీరిద్దరూ ఒక్కటై నేటితో 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దంపతులు ఇద్దరికీ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ సందర్భంగా తనయుడు రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ వేదికగా తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. చిరంజీవి-సురేఖ కూర్చున్న ఫొటోను షేర్ చేసి... ‘నా అతిపెద్ద బలం మీరే. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు రామ్ చరణ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెంకీ గ్రీన్ సిగ్నల్ - త్వరలో 'దృశ్యం 2'..!

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూజోసఫ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ 11 ఇయర్స్ - రానాకు మిహీకా విషెస్

ఇండస్ట్రీలోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చినా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. 2010లో ‘లీడ‌ర్‌' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు రానా. మొదటి సినిమా అని ఏదో కమర్షియల్ హంగులకు పోకుండా తన బాడీ లాంగ్వేజ్ కు సరిపడా పాత్రను ఎంచుకొని... లీడర్ సినిమాలో ముఖ్య‌మంత్రి అర్జున్ ప్ర‌సాద్‌ పాత్ర‌లో న‌టించి... మొద‌టి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఇక అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విభిన్నమైన పాత్రలతో రానా అంటే డిఫరెంట్ గా సినిమాలు చేస్తాడు అన్న పేరును సంపాదించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సన్ ఆఫ్ ఇండియా' - మోహన్ బాబు, ఇళయ రాజా ఆసక్తికర సంభాషణ

గతంలో పలు దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరో సారి అదే జోనర్ తో వచ్చేస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సీటీమార్' టీజర్ కు టైమ్ ఫిక్స్

గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'సీటీమార్'. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో గౌతమ్ నందా అనే సినిమా వచ్చినా అది పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఈసినిమాతో హిట్ కొట్టాలన్న ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. టాకీ పార్ట్ వరకూ పూర్తి కాగా ఇంకా ఒకటి రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఏప్రిల్‌ 2న ప్రపంచ‌ వ్యాప్తంగా విడుద‌ల‌ చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుస అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'వకీల్ సాబ్' మ్యూజిక్ వర్క్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏరేంజ్ లో ఉన్నాయో ఇప్పటికే చూశాం. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూశాం. వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

టీజర్, ఫస్ట్ లుక్ రెడీ.. నాని డబుల్‌ ధమాకా

న్యాచురల్ స్టార్ నాని తన ఫ్యాన్స్ కు మంచి గుడ్ న్యూస్ చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఫిబ్రవరి 24 నాని పుట్టిన రోజు అని తెలిసిందే కదా. ఈ తనపుట్టిన రోజున ఈ రెండు సినిమాల సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. టక్ జగదీష్ సినిమా నుండి టీజర్ ను, శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ రెడీ అయిందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. మరి ఆ సర్‌ప్రైజ్‌లు చూడాలంటే నాని పుట్టిన రోజు వరకూ ఆగాల్సిందే.

TFN Adminవాట్సాప్
Varun Tej Shares A Sneak Peek Into The Sets Of His New Movie Ghani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Ghani,Ghani Movie,Ghani Film,Gh
సినిమా వార్తలు

వరుణ్ 'గని' వర్క్ స్టేషన్

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నవరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్ర‌పాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో వరుణ్ తేజ్, ఉపేంద్రలపై పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. వీరిద్దరి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దుబాయ్ లోస్మార్ట్ పోలీస్ స్టేషన్ - మహేష్ ఫిదా

పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుగుతుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. ఇక అక్కడి షూటింగ్ కు సంబంధించి పలు ఫొటోలు.. లొకేషన్స్ కు సంబందించిన ఫొటోలు ఇప్పటికే మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ తో మరోసారి-రానా రియాక్షన్

బాహుబలి సినిమా అంటే మొదట మనకు గుర్తొచ్చేది బాహుబలి ప్రభాస్-భళ్లాలదేవ రానా. వారిద్దరూ లేకపోతే ఆ సిరీస్ లేనట్టే అని చెప్పొచు. ఇక ఈ సినిమాతో అటు ప్రభాస్, రానా కెరీర్ రేంజ్ ఏ కాదు.. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇక ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న 21 సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదనుకోండి..

TFN Adminవాట్సాప్
సాంగ్

'సీటీమార్' లో 'క్రాక్' భామ

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'థ్రిల్లర్' సినిమాలో నటించి ఆ సినిమాతోమంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది అప్సర రాణి. ఆ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే రవితేజ 'క్రాక్' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన అప్సర రాణి ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ సాంగ్ కు సెలెక్ట్ అయింది.

TFN Adminవాట్సాప్
రివ్యూ

'నాంది' రివ్యూ-మంచి సందేశాత్మకమైన సినిమా

ఓవరాల్ గా చెప్పాలంటే ఓ మంచి సందేశాత్మక చిత్రం చూసిన ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి వస్తుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' కోసం ప్రతిఒక్కరూ

ఆర్ఆర్ఆర్ టార్గెట్ అక్టోబ‌ర్ 13.. అలానే కనిపిస్తుంది రాజమౌళి షూటింగ్ చేస్తున్న విధానం చూస్తుంటే. ఈ సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆ దిశగా షూటింగ్ ను గ్యాప్ లేకుండా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలా లేదనుకున్నా చాలా ఎక్కువ టైమే పడుతుంది. మరి అనుకున్న టైం కే సినిమా రిలీజ్ అవ్వాలంటే.. ఈ రేంజ్ లో షూటింగ్ జరపాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' లో విలన్ గా 'జిషు సేన్ గుప్తా'

మొత్తానికి ఆచార్య ను ఢీ కొట్టగలిగే విలన్ దొరికాడు డైరెక్టర్ కొరటాల శివకు. షూటింగ్ దాదాపు పూర్తవ్వడానికి వస్తున్నా విలన్ పాత్రను మాత్రం ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఆ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. చిరుకు విలన్ గా జిషు సేన్ గుప్తాను సెలెక్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

నితిన్ 'అంధాధున్ రీమేక్' రిలీజ్ డేట్ ఫిక్స్

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మేర్ల‌పాక గాంధీ. ఆ తర్వాత వచ్చిన `కృష్ణార్జున యుద్ధం` ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు నితిన్ తో 'అంధాధున్ రీమేక్' చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించకముందే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 11న చిత్రం విడుద‌ల కానుంద‌ని అధికారికంగా తెలియచేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆకాష్ పూరీ 'చోర్ బజార్' ప్రారంభం

బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ఆంధ్రా పోరి, మెహబూబా సినిమాలతో హీరోగా పరిచయమయ్యాడు ఆకాష్ పూరీ. అయితే ఆ సినిమాలు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. ప్రస్తుతం అనిల్ పాడూరిదర్శకత్వంలో ‘రొమాంటిక్’ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఇప్పటీకే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ను బట్టి ఈ సినిమా ఎంత రొమాంటిక్ గా వుండబోతుందో తెలుస్తుంది. అయితే ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు.ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సందీప్ కిషన్ సినిమాలో జయమ్మ.. ఈసారి పోలీస్

తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు క్రాక్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చేసిన జయమ్మ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ కు వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది. తాజాగా మరో సినిమాలో జయమ్మ మంచి పాత్రను దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్