అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘ఎ ఈజ్ రెడీ టు కిల్, ఎస్ ఈజ్ రెడీ టు స్టన్’ అంటూ ఏప్రిల్ 8న ఉదయం 9గంటల 9నిమిషాలకు ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనితో ఇది ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘𝐀’ is Ready to KILL &
‘𝐒’ is Ready to STUN 🤟#Akhil5FirstLook Blast on April 8th at 9:09 AM 💥@AkhilAkkineni8 @DirSurender @AnilSunkara1 @AKentsOfficial #S2C#Akhil5 pic.twitter.com/64tYx9YMrj— AK Entertainments (@AKentsOfficial) April 6, 2021
కాగా ఈ సినిమాను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు పవర్ ఫుల్ స్టొరీ అందించగా.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు చిత్రయూనిట్.
అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జూన్ 19న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: