‘వకీల్ సాబ్’ సెన్సాార్ రివ్యూ

Pawan Kalyans Vakeel Saab censor Review,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Film Update,Vakeel Saab Movie update,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Movie News,Vakeel Saab Movie Latest News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab Movie Gets Censored,Vakeel Saab Gets Censored,Pawan Kalyan Vakeel Saab Gets Censored,Vakeel Saab Wraps Up Censor,Vakeel Saab Grand Release On Apr 9th,Vakeel Saab On Apr 9th,U/A For Vakeel Saab,Sriram Venu,Sri Venkateswara Creations,Shruti Haasan,Nivetha Thomas,Anjali,Ananya Nagalla,thaman S,Thaman,Vakeel Saab Movie Wraps Up Censor,Pawan Kalyan Vakeel Saab Wraps Up Censor With U/A,Vakeel Saab Movie Gets Censored With U/A,Pawan Kalyan Vakeel Saab Censor Report,Vakeel Saab Censor Report,Vakeel Saab Movie Latest Censor Report,Vakeel Saab Censor,VakeelSaab Movie Censor Update,#VakeelSaab

వకీల్ సాబ్ ఇది ఒక సినిమా కాదు ఒక ఎమోషన్ అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే అసలు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలకు వెళ్లిన పవన్ ఆతరువాత మనసు మార్చుకొని దాదాపు మూడేళ్ల తరువాత పవన్ చేస్తున్న సినిమా ఇది… పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సందర్భం.. మరోవైపు దాదాపు 20 ఏళ్లకు పైగా దిల్ రాజు కు పవన్ తో సినిమా చేయాలన్న కోరిక.. మరోవైపు పవన్ కు ఎంతో అభిమాని అయిన థమన్ కు ఈసినిమాతో పవన్ తో పనిచేసే అవకాశం రావడం ఇలా చాలా ఎమోషన్స్ మధ్య ఈ సినిమా రూపొంది ఏప్రిల్ 9న ధియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దీనికి తోడు నేడు సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బృందం. ఇక సెన్సార్ రిపోర్ట్ ను బట్టి పింక్ మూవీలో సోల్ అలానే ఉన్నా కథలో మాత్రం చాలా మార్పులు ఉన్నాయట. అంతేకాదు పవన్ సినిమా మొత్తం ఉండడట.. మొదట ముగ్గురు హీరోయిన్లతో కొద్దిగా కథ నడిచిన తరువాత పవన్ ఎంట్రీ ఉంటుందట. పింక్ లో అయితే ఒక్క ఫైట్ కూడా ఉండదు కానీ ఈ సినిమాలో మాత్రం ఏకంగా ఐదు ఫైట్స్ ఉన్నాయంటున్నారు. పవన్ నిడివి తక్కువగానే ఉన్నా వర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ఖచ్చితంగా ధియేటర్ లో విజిల్స్ పడతాయని.. ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ కోర్టులో వాదించే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తుంది. మరి సెన్సార్ రిపోర్ అయితే పాజిటివ్ గానే వచ్చింది.. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + one =