బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబల్‌స్టార్” ఇప్పుడు మరోపాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ తో వస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈసినిమాలో ప్రభాస్ విక్రమాధిత్య పాత్రలో నటిస్తుండగా.. పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదుల చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మరో అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో జాతీయ అవార్డ్ గ్రహీత, సీనియర్ సచిన్ ఖేదేకర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈవిషయాన్ని ఆయన కూడా చెప్పేశాడు. తాను ఈసినిమాలో కాలేజ్ డీన్ పాత్రలో నటిస్తున్నానని.. కథను ముందుకు తీసుకెళ్లడంలో తన పాత్ర కూాడా చాాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. . జూలై 30న ఈ సినిమా విడుదల కానుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: