
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 54


'దృశ్యం 2' - టార్గెట్ కంటే ముందే

శ్రీరామనవమి శుభాకాంక్షలు

'పుష్ప'లో రంగమ్మత్త జాయిన్
'బన్నీ' గుండెలపై 'అర్హ'

దుల్కర్ 'లెఫ్టినెంట్ రామ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో సుధీర్ బాబు

చిత్ర పరిశ్రమ ఏదైనా ఒక్కటే -రష్మిక

సినీ కార్మికులు , జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!

"రా "ఏజెంట్ గా కాజల్ అగర్వాల్

"మేజర్ " మూవీ రికార్డ్

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్

"సలార్ "మూవీ కై భారీ సెట్స్

వికారాబాద్ లో 'అఖండ' క్లైమాక్స్

తెలంగాణలో థియేటర్లు బంద్

ఐసోలేషన్ లో ప్రభాస్.. షూట్ కు బ్రేక్
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది కంటే ఈఏడాది ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రతిరోజూ లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా సినీ, రాజకీయరంగంపై కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. అయితే ప్రభాస్ కు కరోనా రాలేదు లెండి. తను ఐసోలేషన్ కు వెళ్లడానికి కారణం తన పర్సనల్ మేకప్ మెన్ కు కరోనా రావడమే. దీంతో ముందు జాగ్రత్తగా ప్రభాస్‌కు కూడా ఐసోలేషన్‌లోకి…

'దృశ్యం 2' - టార్గెట్ కంటే ముందే
జీతూ జోసఫ్ దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో దృశ్యం రీమేక్ దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. అసలు ఈసీక్వెల్ ఉంటుందో లేదో అన్న డౌట్ నుండి సినిమా పట్టాలెక్కింది.. అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో చాలా తొందరగా సినిమా షూటింగ్ ను కూాడా పూర్తి చేశారు. 50రోజులు మాత్రమే ఈసినిమా షూటింగ్ కు టార్గెట్ పెట్టుకున్నారు.. కానీ 50రోజుల కంటే తక్కువగానే సినిమా పూర్తయినట్టు తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ ఏడాదే ఈసినిమాను రిలీజ్ చేయాలన్న నేపథ్యంలో అస్సలు గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ను చేశారు. రీసెంట్ గానే వెంకీ తన పార్ట్ ను పూర్తిచేసుకోగా.. ఇప్పుడు షూటింగ్ మొత్తం…

శ్రీరామనవమి కి "ఖిలాడి "స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీరామనవమి శుభాకాంక్షలు
అభిమానులు , తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం..కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం.అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. పుణ్య దంపతులైన శ్రీ సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.

'పుష్ప'లో రంగమ్మత్త జాయిన్
మొత్తానికి పుష్ప సినిమాలో రంగమ్మత్త అదే అనసూయ ఛాన్స్ కొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా పుష్ప సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా దాదాపు కీలకభాగాన్ని షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమాలో మొదట అనసూయ కూడా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. ఆతరువాత తను ఈసినిమాలో లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇటీవల చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్ లో బన్నీని డైరెక్ట్ గా అనసూయ అడిగింది. మరి ఆతరువాత ఏమైనా క్యారెక్టర్ యాడ్ చేశారేమో తెలియదు కానీ మొత్తానికైతే అనసూయ పుష్ప సినిమాలో నటించే అవకాశం దక్కించుకంది. ఆ విషయాన్ని తనే స్వయంగా తన ఇన్స్టా ద్వారా తెలియజేసింది. పుష్ప షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్టు…
'బన్నీ' గుండెలపై 'అర్హ'
అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటాడో.. ఫ్యామిలీ కి కూడా అంతే టైమ్ కేటాయిస్తాడు. ఇక షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు అర్హ, అయాన్‌లతో కలిసి సందడి చేస్తుంటాడు. మరోవైపు అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే అల్లరి, వాటికి సంబంధించిన క్యూట్ వీడియోలను ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, స్నేహ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. తాజాగా స్నేహ బన్నీ- అర్హ కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో చూడటానికి క్యూట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. దీనితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దుల్కర్ 'లెఫ్టినెంట్ రామ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హనురాఘవపూడి దర్శకత్వంలో తెలుగులో మరో సినిమాలో నటిస్తున్నాడు. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమకథను సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈసినిమా రూపొందనుంది. పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కశ్మీర్‌లో మొదలైంది.

ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో సుధీర్ బాబు
యాక్షన్ థ్రిల్లర్ "V"మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సుధీర్ బాబు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "పలాస 1978"మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు కథానాయకుడిగా "శ్రీదేవి సోడా సెంటర్ "మూవీ తెరకెక్కుతుంది.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

చిత్ర పరిశ్రమ ఏదైనా ఒక్కటే -రష్మిక
తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ”సుల్తాన్ ” మూవీ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు . “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

సినీ కార్మికులు , జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్
కరోనా మహమ్మారి కారణంగా మూవీ షూటింగ్స్ నిలిచిపోయి సినీ కార్మికులు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. ఆ సమయం లో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభించి , సినీ ప్రముఖుల నుండి విరాళాలు సేకరించి, నిత్యావసర వస్తువులు సినీ కార్మికులకు అందజేసి వారిని ఆదుకున్నారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణం లో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున సినీ కార్మికులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

'వరుడు కావలెను' నవమి స్పెషల్ పోస్టర్
హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం నాలుగైదు సినిమాలు నాగశౌర్య లిస్ట్ లో వున్నాయి. వాటిలో ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా తెరకెక్కుతుంది.

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!
2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ నుండి మరే సినిమా రాలేదు. అయితే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా మరో టాపిక్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

"రా "ఏజెంట్ గా కాజల్ అగర్వాల్
“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కాజల్ అగర్వాల్ , తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో కాజల్ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

"మేజర్ " మూవీ రికార్డ్
యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

తలైవి థియేటర్లలోనే.. అవన్నీ రూమర్స్
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగతనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సింది.. కానీ కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడగా.. తలైవి సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. అయితే తాజాగా ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈనేపథ్యంలో ఈరూమర్స్ పై స్పందించిన కంగనా క్లారిటీ ఇచ్చింది.

'మాస్ట్రో' స్పెషల్ పోస్టర్ రిలీజ్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ 'అంధాధున్' తెలుగు రీమేక్ గా మాస్ట్రో రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక నేడు ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మాస్ట్రో నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఫెస్టివల్ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ చూస్తే.. ఈ సినిమాలో హీరో నితిన్ అంధుడు కాబట్టి బ్లాక్ కళ్లద్దాలు హెల్మెట్ పెట్టుకొని హీరోయిన్ నభానటేష్ వెనక స్కూటీ పై కూర్చున్నాడు.

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నిఖిల్ వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2" , "18 పేజెస్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి .

"సలార్ "మూవీ కై భారీ సెట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతిహాసన్ జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. మధు గురుస్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు . ప్రభాస్ హీరో గా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “మూవీ తో పాటు “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

వికారాబాద్ లో 'అఖండ' క్లైమాక్స్
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. బాలయ్య ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా రెండు పాత్రల్లో చేస్తున్నాడు. ఈమధ్యనే ఈసినిమా టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసు కదా. యూట్యూబ్ లో ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని సీనియర్ హీరోల్లో తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

తెలంగాణలో థియేటర్లు బంద్
సినీ ఇండస్ట్రీపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బాగానే పడింది. ఇప్పటికే ఏపీలో థియేటర్ ఆక్యుపెన్సీని 50 వ శాతానికి తగ్గించారు. అలానే తెలుగు నిర్మాతల మండలి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పరిమిత బృందంతో చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటనలో పేర్కొంది. అత్యవసరం అనుకుంటే 50 మంది కార్మికులతో షూటింగ్ చేసుకోవచ్చని, అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా థియేటర్ల విషయంపై ఓ జీవోని జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ.. ఇది ఈ నెల…