దుల్కర్ ‘లెఫ్టినెంట్ రామ్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Dulquer Salmaan Starrer Lieutenant Ram Movie First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Happy RAM Navami,Dulquer Salmaan,Hanu Raghavapudi,Swapna Cinema,Lieutenant Ram​,Dulquer Salmaan​ New Movie,Hanu Raghavapudi Film,Actor Dulquer Salmaan,Dulquer Salmaan Latest Movie,Dulquer Salmaan Plays A Lieutenant,Dulquer Salmaan As Lieutenant In His Upcoming Telugu Movie,Lieutenant Ram,Actor Dulquer Salmaan New Movie,Hanu Raghavapudi New Movie,Dulquer Hanu Movie,Dulquer Telugu Movie,Hanu Raghavapudi Movies,Dulquer Salmaan First Look,Dulquer Salmaan Video,Dulquer Salmaan New Movie Video,Dulquer Salmaan Plays A Lieutenant Ram,Dulquer Salmaan Telugu Film,Dulquer Salmaan Latest Movie Video,Dulquer Salmaan Telugu Movies,Sri Ramanavami 2021,#LieutenantRam,#DulquerSalmaan

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హనురాఘవపూడి దర్శకత్వంలో తెలుగులో మరో సినిమాలో నటిస్తున్నాడు. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈసినిమా రూపొంద‌నుంది. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్ట‌ర్‌‌ని విడుద‌ల చేశారు. మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కశ్మీర్‌లో మొద‌లైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా వుంటే శ్రీ రామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ దుల్కర్ సల్మాన్‌ను మద్రాస్ బెటాలియన్ లెఫ్టినెంట్ రామ్‌గా చూపించే ప్రత్యేక వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి హీరోయిన్ తో పాటు కీల‌క తారాగణంకి సంబంధించిన వివ‌రాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించ‌నుంది. ‘శ్రీరాముడు, ప్రేమ కోసం ఆయన చేసిన యుద్ధం అజరామరం. అలాంటి మా లెఫ్టినెంట్‌ రామ్‌ ప్రేమని త్వరలోనే చూడబోతున్నారు’ అని పేర్కొంది నిర్మాణ సంస్థ.

ఇక ఈ సినిమాను కూడా వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌లో స్వప్నా దత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.