హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం నాలుగైదు సినిమాలు నాగశౌర్య లిస్ట్ లో వున్నాయి. వాటిలో ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా శ్రీరామనవమి సందర్భంగా వరుడు కావలెను చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో హీరో నాగ శౌర్యను అలా గోడపై కూర్చున్నట్లు చూపించాడు దర్శకుడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీ రాముడు సీత దేవి కళ్యాణం జరుగుతుంది. ఇక ఈఫొటో మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో పాటు రాజేంద్ర దర్శకత్వంలో ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్ ను ఇటీవలే ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.ఇంకా ‘అలా ఎలా’ సినిమా దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























