తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ”సుల్తాన్ ” మూవీ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు . “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ , కన్నడ , హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న రష్మిక తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడుతూ … చిత్ర పరిశ్రమ ఏదైనా ఒక్కటే అనీ , ఆయా వ్యక్తులే భిన్నంగా పని చేస్తుంటారనీ , సినిమా వాతావరణం మాత్రం అన్నిచోట్లా ఒకేలా ఉంటుందనీ, తనకు పెద్దగా మార్పు కనపడలేదనీ చెప్పారు. రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సోషల్ మీడియా లో రష్మిక తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























