సినీ ఇండస్ట్రీపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బాగానే పడింది. ఇప్పటికే ఏపీలో థియేటర్ ఆక్యుపెన్సీని 50 వ శాతానికి తగ్గించారు. అలానే తెలుగు నిర్మాతల మండలి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పరిమిత బృందంతో చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటనలో పేర్కొంది. అత్యవసరం అనుకుంటే 50 మంది కార్మికులతో షూటింగ్ చేసుకోవచ్చని, అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా థియేటర్ల విషయంపై ఓ జీవోని జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ.. ఇది ఈ నెల 30వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుంది. అనుమతులు ఉన్న థియేటర్లు రాత్రి 8గంటల లోపు మూసివేయాలి. ఇంకా పలు సూచనలు సూచించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* థియేటర్ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. థియేటర్ లోపలికి, బయటకు వెళ్లే మార్గాల్లో యాజమాన్యం శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
* థియేటర్ ప్రాంగణంలో ప్రేక్షకులు గుమిగుడకుండా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
* షో పూర్తయిన వెంటనే ధియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి. ఏసీ టెంపరేచర్ 24-30 సెల్సియస్ ఉండేలా చూసుకోవాలి.
* సినిమా సినిమాకు విరామం వేర్వేరు సమాయాల్లో ఉండేలా చూసుకోవాలి.
* నిబంధనలను ఉల్లఘిస్తే థియేటర్ యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి
* జిల్లాల్లో కలెక్టర్ల నుంచి పోలీస్ సిబ్బంది వరకూ అంతా అప్రమత్తంగా ఉండాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: