ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఖిలాడి ” మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు , కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు రమేష్ తెరకెక్కించారు.రీసెంట్ గా రిలీజ్ అయిన ” ఖిలాడి “మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ హీరో రవితేజ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయగా , ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న “ఖిలాడి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: