అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటాడో.. ఫ్యామిలీ కి కూడా అంతే టైమ్ కేటాయిస్తాడు. ఇక షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు అర్హ, అయాన్‌లతో కలిసి సందడి చేస్తుంటాడు.
మరోవైపు అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే అల్లరి, వాటికి సంబంధించిన క్యూట్ వీడియోలను ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, స్నేహ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. తాజాగా స్నేహ బన్నీ- అర్హ కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో చూడటానికి క్యూట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. దీనితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: