
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 55


షూటింగ్ లపై తెలుగు నిర్మాతల మండలి కీలక నిర్ణయం

వకీల్ సాబ్ పై సుప్రీంకోర్టు జడ్జి ప్రశంసలు

యంగ్ హీరోస్ కు సరైన జోడీ

రిలాక్స్ మోడ్ లో వరుణ్ తేజ్

ఖిలాడి డైరెక్టర్ కు కరోనా.. షూట్ కు బ్రేక్

నేను చూడలేను - సోషల్ మీడియా బ్రేక్

ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ

ఎన్టీఆర్ పాత ఫొటో వైరల్

ఆదిపురుష్ - 30 రోజుల్లో 30 శాతం

కరోనా వ్యాప్తి పై కాజల్ స్పందన

భారీగా 'ఆది సాయికుమార్' కొత్తసినిమా

'గల్లీ రౌడీ' టీజర్ రిలీజ్

విజయ్ దేవరకొండ తో సినిమా ఆగిపోలేదు

హీరో ప్రభాస్ , నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్

"పుష్ప "లో పల్లెటూరి యువతిగా రష్మిక

మరో నెగటివ్ రోల్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ?
'ఐకాన్' పై దిల్ రాజు క్లారిటీ

ఇష్క్ కూడా వాయిదా
రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న సినిమా ఇష్క్. ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాల్సిన వచ్చింది. నిజానికి ఈడేట్ న టక్ జగదీష్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే టక్ జగదీష్ సినిమా వాయిదా పడటంతో ఈసినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితులు అసలే బాలేవు.. దానికి తోడు థియేటర్లు కూడా బంద్ అవడంతో ఈసినిమా రిలీజ్ కూాాడా వాయిదా పడింది.

షూటింగ్ లపై తెలుగు నిర్మాతల మండలి కీలక నిర్ణయం
గత ఏడాది కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఇప్పటికీ కోలుకోలేదు. సినీ కార్మికులు. హీరోలు సినిమాలు లేక ఖాళీగా ఉండిపోయారు. నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏదో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి.. థియేటర్లలో కాస్త సినిమాల సందడి మొదలైంది అనుకునేలోపే కరోనా సెకండ్ వేవ్ అంటూ మరో పిడుగు పడింది. మరోసారి వరుసగా సినిమా షూటింగ్ లు రద్దవుతున్నాయి. సినిమా రిలీజ్ లు కూడా వాయిదా పడుతున్నాయి.

వకీల్ సాబ్ పై సుప్రీంకోర్టు జడ్జి ప్రశంసలు
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈసినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రంలో లాయర్ గా పవన్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ని ‘వకీల్ సాబ్’ దాటేసింది. ఇప్పటివరకూ ‘వకీల్ సాబ్’ రూ.80 కోట్ల షేర్ మార్కును దాటేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా టైమ్. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సినిమాకు వెళ్ళాలా వద్దా అనే డైలమాలో పడ్డారు ప్రేక్షకులు. దీనితో కలెక్షన్స్ కాస్త…

యంగ్ హీరోస్ కు సరైన జోడీ
యాక్టర్ ,డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ తనయ సాయీ మంజ్రేకర్ , స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రూపొందిన "దబంగ్ 3" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయీ 2 తెలుగు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో సాయీ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

రిలాక్స్ మోడ్ లో వరుణ్ తేజ్
సక్సెస్ ఫుల్ "ముకుంద "మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం "గని ", "F 3 " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. “గని “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఖిలాడి డైరెక్టర్ కు కరోనా.. షూట్ కు బ్రేక్
కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ ను మరోసారి షేక్ చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా విడుదల తేదీలు మార్చేసుకున్నారు దర్శకనిర్మాతలు. షూటింగ్స్ కూడా రద్దు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు రవితేజ సినిమాపై కరోనా ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అందరు మాస్క్ ధరించాలి. అత్యవసరాలకు మినహాయించి బయట…

నేను చూడలేను - సోషల్ మీడియా బ్రేక్
సోషల్ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది ఛార్మీ. దానికి కారణం కరోనానే కారణం. కరోనా సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది. ఈనేపథ్యంలోనే ఛార్మీ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పాండమిక్ మరింత భయంకరంగా ఉంది..ఈ పరిస్థితులు చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదని, అందుకే కొద్దిరోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.. అందరూ ఇంట్లోనే ఉండి, మీరు ప్రేమించేవారిని జాగ్రత్తగా చూసుకోండి.. అని అభిమానులకు సూచించింది. 'నిజానికి అందరూ బాగుండాలని కోరుకుంటూ వచ్చాను. కానీ మన దేశం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అందుకే ఇప్పుడు నేను సోషల్ మీడియాను వదిలేస్తున్నాను. మీరు మాత్రం…

ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. మునుపటి కంటే చాలా తొందరగా కరోనా సోకుతుండటంతో అందరూ భయపడుతున్నారు. ఇక సినీ పరిశ్రమపై దీని ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.. చాలా మంది నటీనటులు కరోనా బారిన పడ్డారు. మరోవైపు చాలా చోట్ల లాక్ డౌన్ కూడా విధించారు. థియేటర్లు కూడా మూసేశారు. కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్లు ఇంకా ఓపెన్ అయి ఉన్నాయి.

ఎన్టీఆర్ పాత ఫొటో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "టెంపర్ "మూవీ తో వరస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఎన్టీఆర్ కు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 13 వ తేదీన రిలీజ్ కానుంది.

ఆదిపురుష్ - 30 రోజుల్లో 30 శాతం
తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈసినిమా తీయడం అంత ఈజీ కాదని ఇప్పటికే చెప్పాడు. ఇలాంటి సినిమాను తీయాలంటే ఎన్నో కాంప్లికేషన్స్ ను తట్టుకోవాల్సి వస్తుంది. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే అలాంటిది ఏం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.

అల్లు కాంపౌండ్ నుండి కొత్త హీరో - బతుకు బస్టాండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. ఎవరికి వారు వాళ్ల కెరీర్ లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా కొత్త హీరోలు వస్తున్నారు. ఇప్పుడు ఈ కాంపౌండ్ నుండి హీరోగా పరిచయం అవుతున్న హీరో విరాన్ ముత్తం శెట్టి. బతుకు బస్టాండ్ పేరుతో ఐవీ రెడ్డి డైరక్షన్ లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగాఈ హీరో తన మొదటి సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విడుదలైన ఈ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫుల్ మాస్ సినిమాగా ఇది తెరకెక్కుతోందని…

కరోనా వ్యాప్తి పై కాజల్ స్పందన
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ “చందమామ ” మూవీ తో గుర్తింపు పొంది 13 సంవత్సరాలుగా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ కథానాయికగా రూపొందిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా పై కాజల్ స్పందించి సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.

భారీగా 'ఆది సాయికుమార్' కొత్తసినిమా
హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. రీసెంట్ గానే తను నటించిన శశి సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమాతో పాటు పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో 'జంగిల్' అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. ఈ సినిమాతో పాటు భాస్కర్ బంటు పల్లి దర్శకత్వంలో ఓసినిమా తెరకెక్కుతుంది.

'గల్లీ రౌడీ' టీజర్ రిలీజ్
వరుస సినిమాలతో యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ తో అలరించాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారుచిత్రయూనిట్.

విజయ్ దేవరకొండ తో సినిమా ఆగిపోలేదు
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కూడా మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సుకుమార్ అండ్ టీమ్.. ‘పుష్ప’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయమై క్లారిటీ ఇచ్చారు. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమాను రామ్ చరణ్‌తో చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా మాత్రం పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు.

ఆచార్య , సర్కారు వారి పాట , F 3 మూవీస్ పై కరోనా ఎఫెక్ట్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ , చిరంజీవి - కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ -పూజాహెగ్డే జంటలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "ఆచార్య "మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. "ఆచార్య "మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది.బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా "సర్కారు వారి పాట "మూవీ తెరకెక్కుతుంది. దుబాయ్ లో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజున హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. "సర్కారు వారి పాట " మూవీ 2022 జనవరి లో రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్…

హీరో ప్రభాస్ , నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ “సలార్ ” మూవీస్ చిత్రీకరణ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"పుష్ప "లో పల్లెటూరి యువతిగా రష్మిక
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పలు భాషల బిజీ హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో , నేషనల్ అవార్డ్ విన్నర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరో నెగటివ్ రోల్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ?
"పోడా పోడి "మూవీ తో కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ , కన్నడ , మలయాళ భాషా సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పలు తమిళ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటించిన వరలక్ష్మి "తెనాలి రామకృష్ణ బి ఎ బి ఎల్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "నాంది ", "క్రాక్ "మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. వరలక్ష్మి ప్రస్తుతం 5తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
'ఐకాన్' పై దిల్ రాజు క్లారిటీ
చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా సరే దిల్ రాజు కమిట్ అయ్యాడంటే అది దాదాపు పూర్తయినట్టే. సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టే నిర్మాతల్లో ఒకడు కాబట్టే టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే వకీల్ సాబ్ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా తన నిర్మాణంలో పెండింగ్ లో ఉన్న ఐకాన్ పై ఇప్పుడు నోరు విప్పాడు దిల్ రాజు.