మొత్తానికి పుష్ప సినిమాలో రంగమ్మత్త అదే అనసూయ ఛాన్స్ కొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా పుష్ప సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా దాదాపు కీలకభాగాన్ని షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమాలో మొదట అనసూయ కూడా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. ఆతరువాత తను ఈసినిమాలో లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇటీవల చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్ లో బన్నీని డైరెక్ట్ గా అనసూయ అడిగింది. మరి ఆతరువాత ఏమైనా క్యారెక్టర్ యాడ్ చేశారేమో తెలియదు కానీ మొత్తానికైతే అనసూయ పుష్ప సినిమాలో నటించే అవకాశం దక్కించుకంది. ఆ విషయాన్ని తనే స్వయంగా తన ఇన్స్టా ద్వారా తెలియజేసింది. పుష్ప షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుపుతూ మరోసారి తనకు ఛాన్స్ ఇచ్చిన సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఇక ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా మిలియన్ రికార్డ్స్ తో దూసుకుపోవడమే కాదు.. సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఆగష్ట్ 13న ఈ మూవీ ని రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: