సక్సెస్ ఫుల్ “అర్జున్ సురవరం “మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నిఖిల్ వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2” , “18 పేజెస్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా “18 పేజెస్ ” మూవీ రూపొందుతుంది. డిఫరెంట్ థీమ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరో నిఖిల్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు . దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. మేజర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “18 పేజెస్ ” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక గెస్ట్ హౌస్ లో జరుగుతుంది. హీరో , హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: